AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆడు మగాడ్రా బుజ్జి..! భార్యపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు

విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కిన భార్యపై ఓ వ్యక్తి వినూత్నంగా పగ తీర్చుకున్నాడు. ఆమె పేరుతో ఉన్న బైక్‌తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి ఆమెకు జరిమానాల భారం వేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన యువతికి, బీహార్‌లోని పాట్నాకు చెందిన యువకుడికి వివాహం జరిగింది.

Viral: ఆడు మగాడ్రా బుజ్జి..! భార్యపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు
Representative Image
Ravi Kiran
|

Updated on: Feb 11, 2025 | 9:11 PM

Share

విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కిన భార్యపై ఓ వ్యక్తి వినూత్నంగా పగ తీర్చుకున్నాడు. ఆమె పేరుతో ఉన్న బైక్‌తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి ఆమెకు జరిమానాల భారం వేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన యువతికి, బీహార్‌లోని పాట్నాకు చెందిన యువకుడికి వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన నెల రోజులకే వారి మధ్య విభేదాలు రావడంతో ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు విడాకుల నోటీసు పంపింది. ప్రస్తుతం ఈ విడాకుల పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే వివాహ సమయంలో ఆ యువకుడికి యువతి తల్లిదండ్రులు ఒక బైక్‌ను కానుకగా ఇచ్చారు. అయితే ఆ బైక్‌ను మాత్రం తన కుమార్తె పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయినా ఆ యువకుడు మాత్రం బైక్‌ను తిరిగి ఇవ్వలేదు.

అతను ఆ బైక్‌పై తిరుగుతూ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ బైక్‌కు సంబంధించి జరిమానా చలానాలను ఆ యువతికి పంపించారు. తన పేరు మీద బైక్ ఉండటంతో ఆమె తొలుత సమయం ప్రకారం చలానాలను కట్టేసింది. అయితే వరుసగా చలానాల భారం పెరుగుతుండటంతో భర్త కుట్ర అర్థమై ఆమె పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. గత మూడు నెలల్లోనే నాలుగు సార్లు చలానాలు వచ్చాయని ఆమె వాపోయింది. ఆ యువకుడు మాత్రం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ భార్యను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అంతేకాకుండా విడాకులు మంజూరు అయ్యే వరకూ బైక్ ఇచ్చేది లేదని ఆమెకు తేల్చి చెప్పాడు.

భర్త చేస్తున్న వేధింపులు తట్టుకోలేక ఆమె తొలుత పాట్నా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. దీంతో ఆమె తండ్రితో కలిసి తమ స్వస్థలంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, భర్తే బైక్ నడుపుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఒక అఫిడవిట్ సమర్పించాలని పోలీసులు ఆమెకు సూచించారు. భార్యను వేధించేందుకు భర్త చేస్తున్న ఈ వింత రివెంజ్ ప్లాన్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.2 రేటింగ్
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.2 రేటింగ్
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
2027లో బంగారం.. వైరల్ అవుతున్న బాబా వంగా అంచనాలు.. అసలు నిజమేంటి?
2027లో బంగారం.. వైరల్ అవుతున్న బాబా వంగా అంచనాలు.. అసలు నిజమేంటి?