AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీ నిరుద్యోగులకు తీపికబురు.. మెగా డీఎస్సీపై కీలక ప్రకటన

నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. 16,247 టీచ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ వెల్ల‌డించింది. జూన్ నాటికి నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని తెలిపింది. జీఓ 117కు ప్ర‌త్యామ్నాయం తీసుకొస్తామని పేర్కొంది.

AP News: ఏపీ నిరుద్యోగులకు తీపికబురు.. మెగా డీఎస్సీపై కీలక ప్రకటన
Job Seekers
Ravi Kiran
|

Updated on: Feb 12, 2025 | 1:07 PM

Share

నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. 16,247 టీచ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ వెల్ల‌డించింది. జూన్ నాటికి నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని తెలిపింది. జీఓ 117కు ప్ర‌త్యామ్నాయం తీసుకొస్తామని పేర్కొంది. గ‌తంలో టీచ‌ర్లకు 45 ర‌కాల యాప్ లు ఉండేవ‌ని, వాటన్నింటినీ క‌లిపి ఒకే యాప్ గా మార్చేశామ‌ని విద్యాశాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ తెలిపారు. అలాగే త్వ‌ర‌లో టీచ‌ర్ల బ‌దిలీల చ‌ట్టం తేనున్నట్లు వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లామ‌ని, వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో దీనిపై బిల్లు పెడ‌తార‌ని ఆయ‌న చెప్పారు. వీసీల నియామ‌కం పూర్త‌య్యాక అన్ని విశ్వ‌విద్యాల‌యాల‌కు ఏకీకృత చ‌ట్టం అమ‌లు చేస్తామ‌న్నారు.

ఇక మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న విద్యాశాఖ.. ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతోంది. కాగా, 16,247 ఉపాధ్యాయ‌ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్లు (ఎస్‌జీటీ)- 6,371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ)- 1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (పీజీటీ)- 286, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీ)- 132, ప్రిన్సిపాల్స్- 52 పోస్టులు ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..