ఫోన్ తో పరిచయం.. లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం.. అంతే కాకుండా ఇంకేం చేశాడంటే

ఫోన్ తో పరిచయం.. లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం.. అంతే కాకుండా ఇంకేం చేశాడంటే
Chittoor man Arrested

సెల్ ఫోన్ లు ఎంత ఉపయోగకరమో, అంతకన్నా ఎక్కువ ప్రమాదకరమని ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. ఫోన్ ద్వారా బాలికకు పరిచయం ఏర్పడిన యువకుడు.. ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. నిత్యం ఆమెతో..

Ganesh Mudavath

|

Mar 02, 2022 | 3:57 PM

సెల్ ఫోన్ లు ఎంత ఉపయోగకరమో, అంతకన్నా ఎక్కువ ప్రమాదకరమని ఈ ఘటన చూస్తే తెలుస్తుంది. ఫోన్ ద్వారా బాలికకు పరిచయం ఏర్పడిన యువకుడు.. ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. నిత్యం ఆమెతో మాట్లాడుతూ దగ్గరయ్యాడు. అతని మాయమాటలు నమ్మిన బాధితురాలు.. అతనితో కలిసి యువకుడి ఊరికి వెళ్లింది. అక్కడ యువకుడు బాలికను ఓ లాడ్జీలో ఉంచి అత్యాచారానికి(Rape) పాల్పడ్డాడు. అంతే కాదు..ఆమెను వ్యభిచార ముఠాకు విక్రయించేందుకూ ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బాలిక.. అతని చెర నుంచి తప్పించుకుని పోలీసులను(Police) ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యువకుడితో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరికి(Mangalagiri) చెందిన బాలికకు ఫోన్ ద్వారా రాజేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నాని మాయ మాటలు చెప్పాడు.

కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు నిత్యకృత్యమయ్యాయి. గత నెల 22న బాలికకు కారులో బయటకు వెళ్దామని చెప్పి, రాజేష్ తెలంగాణ రాష్ట్రంలోని సొంత ఊరికి తీసుకెళ్లాడు. బాలికను తీసుకెళ్లడానికి అతని బంధువులైన అవినాష్, వినోద్ ల సాయం తీసుకున్నాడు. ఓ లాడ్జీకి తీసుకెళ్లి మద్యం తాగించారు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా బాలికను వ్యభిచారం నిర్వహించే యువకుడికి విక్రయించేందుకు ప్రయత్నించాడు. మెలకువలోకి వచ్చిన బాలిక.. తాను మోసపోయినట్లు గుర్తించి లాడ్జీ నుంచి పారిపోయింది. అనంతరం 100 నెంబర్ కు ఫోన్ చేసి, జరిగిన ఘటనను వివరించింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ విషయాన్ని మంగళగిరి పోలీసులు తెలిపారు.

అప్పటికే మంగళగిరి పీఎస్ లో బాలిక అదృశ్యం కేసు నమోదు కావటంతో పోలీసులు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళారు‌. అప్పటికే బాలికను సంరక్షించిన తెలంగాణ పోలీసులు మంగళగిరి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో రాజేష్ తో పాటు మిగతా ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. అపరిచితులతో పరిచయం అయినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని మంగళగిరి డీఎస్పీ రాంబాబు సూచించారు.

       – టి.నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు

Also Read

రేపటితో ముగియనున్న గడువు.. ఆ జిల్లా నుంచే అధిక వినతులు.. హామీ ప్రకారమే పునర్ వ్యవస్థీకరణ

ఇదేం బ్యాటింగ్‌రా సామీ.. 22 బంతుల్లో 8 సిక్సులు, 3 ఫోర్లు.. 309 స్ట్రైక్‌రేట్‌తో సునీల్ నరైన్ ఊచకోత

TS Traffic Challans: కేవలం 8 గంటల్లో లక్షా 77 వేల చలాన్లు క్లియర్.. హైదరాబాద్‌లో మొత్తం కోటీ 70 లక్షల పెండింగ్‌ చలనాలు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu