ఇంటి ముందు కూర్చున్న వారిపై దూసుకొచ్చిన మృత్యువు.. నలుగురిని కబళించిన వ్యాన్.. అదే కారణమని అనుమానం
కొన్ని ప్రమాదాలు ఊహకందనివి. రెప్పపాటు కాలంలో వేగంగా దూసుకొచ్చి, ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేస్తుంది. జాతీయ రహదారుల సమీపంలోని గ్రామాల్లో ఇలాంటి ప్రమాదాలు...
కొన్ని ప్రమాదాలు ఊహకందనివి. రెప్పపాటు కాలంలో వేగంగా దూసుకొచ్చి, ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేస్తుంది. జాతీయ రహదారుల సమీపంలోని గ్రామాల్లో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. రహదారిని ఆనుకుని ఇళ్లు ఉండటం, వేగంగా వచ్చే వాహనాలను నియంత్రించే వ్యవస్థ లేకపోవడం వంటి కారణాలతో ఎందరో మృత్యువాత పడుతున్నారు. తాజాగా కడప(Kadapa) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. రహదారి పక్కన ఉన్న ఇంటి వద్ద మంచంపై కూర్చుని హాయిగా మాట్లాడుకుంటున్న వారిపై వాహనం వేగంగా దూసుకొచ్చింది. కళ్లు తెరిచి చూసే లోపే వారి ప్రాణాలను కబళించింది. వారి వారి కుటుంబాలను విషాదంలో పడేసింది. కడప జిల్లా సీకే దిన్నె సమీపంలోని మద్దిమడుగు(Maddimadugu) వద్ద కడప-బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మద్దిమడుగు గ్రామంలో.. రహదారి పక్కనే ఉన్న ఉన్న ఇంటి ముందు మంచంపై కూర్చొని ఉండగా ఈ ఘటన జరిగింది.
కడప నుంచి రాయచోటికి వెళ్తున్న వ్యాను అదుపుతప్పి.. మంచంపై కూర్చున్న వారిపై వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కొండయ్య, అమ్ములు దంపతులతోపాటు, లక్ష్మీదేవి, దేవి అనే నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. కొండయ్య, లక్ష్మీదేవి అక్కడికక్కడే చనిపోగా.. మిగతా ఇద్దరిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రవాణాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. వ్యాన్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. ఒకేసారి నలుగురు మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read
Praggnanandhaa: ఈ టీనేజ్ విజయానికి హైపిచ్చే బదులు.. మరింత ఎదిగేందుకు సహాయం చేయాలి: జీఎం శ్రీరాం జా
Petrol Price Hike: వాహనదారులకు దిమ్మతిరిగే వార్త.. లీటర్ పెట్రోల్ ధర డబుల్ సెంచరీకి.. వార్ ఎఫెక్ట్..
Viral News: ఇదేందిది.! అదిరిపోయే ఫ్లాట్‌ను వదిలేసి స్కూల్ బస్‌లో మకాం.. లోపల చూస్తే షాకే..