రేపటితో ముగియనున్న గడువు.. ఆ జిల్లా నుంచే అధిక వినతులు.. హామీ ప్రకారమే పునర్ వ్యవస్థీకరణ
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల(New districts in AP) పునర్ వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు కలెక్టర్లకు 7,500 సలహాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు...
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల(New districts in AP) పునర్ వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు కలెక్టర్లకు 7,500 సలహాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా నుంచి ఎక్కువగా 4,500 సలహాలు, సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అధిక సూచనలు కృష్ణా జిల్లా నుంచి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల్ని పరిశీలించిన తరువాత ఆన్ లైన్ లో మంత్రి వర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర స్థాయి కమిటీ సిఫారసుల్ని జిల్లా కలెక్టర్లకు పంపిన ఏపీ (Andhra Pradesh) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.. అలాగే సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ప్రసాద్ ఆన్‌లైన్‌లో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. ఇక ఈ ప్రతిపాదనలకు కలెక్టర్లూ ఆమోదం తెలిపారు. ఇంకేవైనా అంశాలుంటే అవన్నీ కూడా తుది నోటిఫికేషన్ ఇచ్చేలోగా తెలియజేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తూ పునర్‌వ్యవస్థీకరణకు చర్యలు తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజలు, ప్రజా సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణ రేపటితో ముగియనుంది. ప్రజాభిప్రాయ సేకరణ మేరకే 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ అధికారిక ప్రకటన జారీ అవుతుంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలనను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో18 నుంచి 20 లక్షల జనాభాతో ఒక డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయనున్నారు.
1974 ఏపీ డిస్ట్రిక్ట్.. ఫార్మేషన్ లా.. ప్రకారం కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్స్ కూడా ఏర్పాటు కానున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల స్థానంలో 26 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిలాల్లో 11 బ్రిటీష్ పాలనలో ఏర్పాటు అయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వతా పాలన సౌలభ్యం దృష్ట్యా గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో కలిపి ఒంగోలు కేంద్రంగా ఫిబ్రవరి 2, 1970 న ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. అలాగే విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో కలిపి విజయనగరం కేంద్రంగా 1979 జూన్ 1న చివరిగా విజయనగరం డిస్ట్రిక్ట్ (Districts) ఏర్పాటైంది.
Also Read
Viral Video: వీరు పిల్లలు కాదు.. పిడుగులు.. ఈ వీడియో నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్
Viral Video: తాతతోనే ఉంటా.. విడిచి వెళ్లలేక చిన్నారి కంట కన్నీరు.. వైరలవుతోన్న వీడియో
Viral News: ఇదేందిది.! అదిరిపోయే ఫ్లాట్‌ను వదిలేసి స్కూల్ బస్‌లో మకాం.. లోపల చూస్తే షాకే..