TDP – JSP: భీమ్లా నాయక్‌కు టీడీపీ సపోర్ట్ అందుకేనా..? ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌.. ఆశ్చర్యంలో జనసేన వర్గాలు..!

TDP - JSP: భీమ్లా నాయక్‌కు టీడీపీ సపోర్ట్ అందుకేనా..? ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌.. ఆశ్చర్యంలో జనసేన వర్గాలు..!
Cbn On Bheemla Nayak

Bheemla Nayak Movie - TDP: భీమ్లా నాయక్ సినిమాకు టీడీపీ సపోర్ట్ ఫ్యూచర్ పొత్తుకు సంకేతమా..? పవన్‌కు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు మాట్లాడటం వెనుక అసలు ఆంతర్యం ఏమిటి..?

Shaik Madarsaheb

|

Mar 02, 2022 | 2:01 PM

Bheemla Nayak Movie – TDP: జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు టీడీపీ సపోర్ట్ ఫ్యూచర్ పొత్తుకు సంకేతమా..? పవన్‌కు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు మాట్లాడటం వెనుక అసలు ఆంతర్యం ఏమిటి..? అడగకుండానే అక్కున చేర్చుకుంటున్న పసుపు పార్టీపై జనసైనికులు ఏమనుకుంటున్నారు..? రాబోయే ఎన్నికల్లో పొత్తు విషయమై తెలుగుదేశం, జనసేన పార్టీల్లో అంతర్గతంగా ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి..? ఈ విషయాలన్నీ ఏపీ (AP Politics) రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే.. ప్రస్తుతం భీమ్లానాయక్‌కు తెలుగుదేశం పార్టీ నుంచి అడగని అండ చాలానే దొరికిందని జనసేన నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీలోని సినిమా థియేటర్లు,టికెట్ల వ్యవహారంపై ఓ ముక్క కూడా మాట్లాడకపోయినా.. టీడీపీ నేతలు మాత్రం ప్రెస్ మీట్లు, వరుస ట్వీట్లతో హోరెత్తించారు. తాము మద్దతు కోరకపోయినా తెలుగు తమ్ముళ్ల నుంచి భీమ్లానాయక్‌కు ఇంత సపోర్ట్ రావడంపై ఆశ్చర్యంలో ఉన్నాయి జనసేన (Janasena) వర్గాలు.

రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావాలంటే జనసేనతో తప్పనిసరిగా పొత్తు ఉండాల్సిందేనని టీడీపీ భావిస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. జనసేనతో పొత్తులేకుండా బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. ఓట్లు చీలి వైసీపీకి లాభం కలిగింది. 2024 ఎన్నికల్లో కూడా పొత్తు లేకపోతే మళ్లీ వైసీపీకే అధికారం దక్కడం ఖాయమని టీడీపీ ముందస్తుగా భావించి జనసేనపై ప్రేమకురిపిస్తోందని రాజకీయ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం గెలవాలంటే.. జనసైనికుల మద్దతు ఉండాలి. కానీ జనసేన అధిష్ఠానం మాత్రం ఇప్పటికీ పొత్తుపై పెదవి విప్పడంలేదు. టీడీపీ రమ్మంటున్నా.. జనసేన చూద్దాం అనే ధోరణి ప్రదర్శిస్తోంది. పైగా తమ పార్టీ పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగుపడిందని భావిస్తోంది. ఎందుకంటే గత రెండేళ్లుగా క్యాడర్‌ను పెంచుకోవడపై జనసేన అధిష్ఠానం ప్రధానంగా దృష్టి పెట్టింది. అభిమానులు ఉన్నారు కాని ఓట్లు వేయడంలే, చూడటానికి వస్తున్నారు కాని ఎన్నికల్లో సైడైపోతున్నారు. ఈ లోపాన్ని సరిచేసుకునే పనిలో ఉంది పవన్ పార్టీ. ఈ క్రమంలో విస్తృతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, క్యాడర్ పెంచుకునే పనులు చేస్తోంది.

మరోవైపు 2019 ఎన్నికల టైంతో పోలిస్తే జనసేన ఇప్పుడు బలపడిందని టీడీపీ కూడా భావిస్తోంది. ఇది తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందని కూడా అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ను టీడీపీ నేతలు సందు దొరికినప్పుడల్లా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. భీమ్లానాయక్ సినిమా రిలీజ్ టైంలో కూడా ఇదే జరిగింది. ఎలాగూ జనసైనికులు,పవన్ అభిమానులు సినిమా విషయంపై ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు మద్ధతు పలకడం ద్వారా తమపై మంచి అభిప్రాయం జనసైనికుల్లో కలగాలని స్కెచ్ వేసినట్టుంది తెలుగుదేశం. అందుకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పవన్ కళ్యాణ్‌కు మద్దతు పలికారని భావిస్తున్నారు.

మొత్తానికి రాబోయే ఎన్నికల్లో పొత్తుపై టీడీపీ నేరుగా పచ్చజెండా ఊపేస్తే..జనసేన మాత్రం అంతర్గతంగా ఆలోచనలు చేస్తోంది. త్వరలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవం లో ఫ్యూచర్ పొత్తులపై జనసేనాని పవర్ స్టార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

– విక్రమ్, విజయవాడ, టీవీ9 తెలుగు

Also Read:

Viral Video: వామ్మో.. మీ కళ్లను మీరే నమ్మలేరు.. ఈ మ్యాజిక్ ట్రిక్ ఏంటో మీరు కనిపెడితే మీరు జీనియస్..

Viral Video: లైకులు వస్తాయనుకున్నాడు.. షర్ట్ పైకి ఎగరేశాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu