Shivaratri Festival: హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనడమే కాదు.. చేతల్లో చూపించారు..!
Shivaratri Festival: హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని మాటలు చెప్పడం కాదు... దాన్ని చేతల్లో చూపించడమే ఈ సమాజానికి కావాలి. అసలైన లౌకికవాదం... పరమత గౌరవం.....
Shivaratri Festival: హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని మాటలు చెప్పడం కాదు.. దాన్ని చేతల్లో చూపించడమే ఈ సమాజానికి కావాలి. అసలైన లౌకికవాదం.. పరమత గౌరవం… అంటే ఏమిటో చూపించారు రాజమహేంద్రవరం జిల్లా గోదావరి తీరంలోని ముస్లింలు. శివరాత్రి (Shivaratri Festival) పర్వదినం రోజున ఉపవాసాలు ఉండే భక్తులకు ప్రసాదాలు తయారుచేసి పంపిణీ చేశారు. రంజాన్ లో .. రాం, దీపావళి లో వలీ ఉన్నాడంటారు. అలాగే.. ఈశ్వరునిలో.. ఈషా ఉన్నాడంటూ చాటిచెప్పారు. పర్వదినం అంటే.. పదిమంది ఆనందంగా ఉండటమే అని నిరూపించారు. మతాలకతీతంగా ముస్లింలు (Muslims)ఇలా ప్రసాదాలు పంపిణీ చేయడం అందరిని ఆకట్టుకున్నారు. వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.