Andhra Pradesh: డిప్యూటీ సీఎం ఇలాకాలో దారుణ ఘటన.. పదివేలు అప్పు చెల్లించలేదని కాలు నరికిన ఘనుడు..నిందితుడు అరెస్ట్

Andhra Pradesh: చిత్తూరు జిల్లా(Chittoor District)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న తన అప్పు చెల్లించలేదని.. అప్పు తీసుకున్న వ్యక్తి కాలు నరికిన ఘటన డిప్యూటీ సీఎం నారాయణస్వామి..

Andhra Pradesh: డిప్యూటీ సీఎం ఇలాకాలో దారుణ ఘటన.. పదివేలు అప్పు చెల్లించలేదని కాలు నరికిన ఘనుడు..నిందితుడు అరెస్ట్
Chittoor District
Follow us
Surya Kala

|

Updated on: Mar 02, 2022 | 11:14 AM

Andhra Pradesh: అప్పులు తీసుకున్న బాధితులు ఉలిక్కిపడే ఘటన ఇది. వడ్డీ వ్యాపారులు షాక్‌కు గురయ్యే సంఘటన ఇది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఏకంగా బాధితుడిపై దాడికి పాల్పడ్డాడు ఆ వడ్డీ వ్యాపారి. అప్పు చెల్లించలేదని.. డబ్బులు వసూలు చేసేందుకు బాధితుడిని మామిడి తోటకు తీసుకెళ్లాడు. వడ్డీ వ్యాపారి చేసిన దాడిలో బాధితుడి కాలు విరిగింది. దీంతో బాధితుడిప్పుడు.. హాస్పిటల్‌ బెడ్‌పై కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా(Chittoor District)లో చోటు చేసుకుంది. తీసుకున్న తన అప్పు చెల్లించలేదని.. అప్పు తీసుకున్న వ్యక్తి కాలు నరికిన ఘటన డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Deputy CM Narayana Swamy) నియోజకవర్గంలో జరిగింది. ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర గంగాధర్ నెల్లూరు మండలం పెడకంటిపల్లి కి చెందిన చంద్రన్ అనే వ్యక్తి 10 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే తాను డబ్బులు తిరిగి ఇస్తానన్న సమయానికి చంద్రన్ బాకీ తీర్చలేకపోయాడు. దీంతో ఈశ్వర్ రెడ్డి.. తన డబ్బులు తిరిగి ఇవ్వలేదని చంద్రన్ ను  మామిడి తోటల్లోకి తీసుకెళ్లి  దాడికి పాల్పడ్డాడు. వేట కొడవలితో కాలు నరికాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రన్ ను వెంటనే చిత్తూరు లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే ఎస్సీ వర్గానికి చెందిన చంద్రన్ పై దాడి టీటీడీ నేతలు,  ప్రజా సంఘాలు చేయడాన్ని  ఖండిస్తున్నాయి. నిందితుడు ఈశ్వర్ రెడ్డి పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈశ్వర్ రెడ్డి అరెస్టు చేశారు.

ఇదే విషయంపై టీటీడీ నేత నారా లోకేష్ స్పందిస్తూ.. డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌ స్వామి పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం ఇలాకాలోనే ఇలాంటి ఘటన జరగడం దారుణమని అన్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో.. ఆదీ త‌న ద‌ళిత‌జాతిని చంపేస్తున్నా.. ప‌ట్టించుకునే తీరిక‌లేక‌లేదు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ దారుణ ఘటనతో మరోసారి రాష్ట్రంలో ద‌ళితుల ప్రాణాల‌కు ర‌క్షణ‌లేద‌ని స్పష్టమైందన్నారు లోకేష్. కేవలం ప‌దివేల రూపాయలు  బాకీ చెల్లించ‌లేద‌ని చంద్రన్ ని త‌న మామిడితోట‌కి ఎత్తుకెళ్లిన ఈశ్వర్‌రెడ్డి కాళ్లూ చేతులూ విర‌గ్గొట్టించేయ‌డం పైశాచికానికి ప‌రాకాష్ట అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

నిత్యం సీఎం జగన్ భ‌జ‌నలో మునిగి తేలే ద‌ళిత ఉప ముఖ్యమంత్రి నారాయ‌ణ స్వామికి మీ ద‌ళిత‌జాతికి ఇంత అన్యాయం జ‌రుగుతుంటే స్పందించే సమయం లేదా అంటూ లోకేష్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Also Read:

Lord Hanuman: రామేశ్వరంలో భారీ 108 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్ట.. ఇప్పటికే పనులు ప్రారంభం..

ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధర ఎంత? మీ నగరంలో పెరిగిన, తగ్గిన వివరాలు ఇదిగో

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..