Vizianagaram: పోలీసుల అదుపులో కిలాడీ లేడీలు.. కాజేసిన డబ్బుపై పొంతనలేని సమాధానం..
Vizianagaram Crime News: విజయనగరం జిల్లా సాలూరులో కిలాడీ వాలంటీర్ మానాపురం రమ్యతోపాటు ఆమె తల్లి అరుణను సాలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Vizianagaram Crime News: విజయనగరం జిల్లా సాలూరులో కిలాడీ వాలంటీర్ మానాపురం రమ్యతోపాటు ఆమె తల్లి అరుణను సాలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమాయకపు మహిళలకు మాయమాటలు చెప్పి, అధిక వడ్డీ ఆశజూపి పొదుపులు, చిట్టిల పేరుతో కోట్లు కొల్లగొట్టి పరారరయ్యారు సాలూరు (Salur) కు చెందిన తల్లీకూతుళ్లు.. తమ సొమ్ము అంతా కాజేసి పరారయ్యారన్న సమచారంతో కన్నీరుమున్నీరు అయ్యారు వందలాది మంది బాధితులు.. ఆ తర్వాత వందలాది మంది బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు తల్లికూతుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో రమ్య సహకరించటం లేదని తెలుస్తుంది.. కాజేసిన డబ్బు పై పొంతనలేని సమాధానం చెప్తున్నట్లు సమాచారం.. కొట్టేసిన కోట్ల రూపాయల నగదు ఏమి చేశారు? ఎవరెవరికి ఇచ్చారు? డబ్బు రికవరీ పై పోలీసులు పెద్ద కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది.
సాలూరులోని చిట్లు వీధికి చెందిన వాలంటీర్ రమ్య, ఆమె తల్లి అరుణతో కలిసి 15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. అయితే.. పలు వీధుల్లో వడ్డీ ఆశ చూపి దాదాపుగా ఐదు వందల మంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. చిట్టీలు, వడ్డీ, పొదుపు రూపంలో వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. బాధితుల నుంచి సుమారు రూ.4 కొట్లపైగా వసూలు చేసినట్లు సమాచారం.
Also Read: