Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విశాఖ జిల్లాలో భూముల విలువ పెంపునకు కసరత్తు.. ప్రజల నుంచి అభ్యంతరాల కోసం రిజిస్ట్రేషన్ల శాఖ ఇలా..

విశాఖ జిల్లాలో భూముల విలువ పెంపునకు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు వసూలుకు నిర్ణయం తీసుకుంది. ప్రాంతాల ప్రాధాన్యత ఆధారంగా పెంచేందుకు ఇప్పటికే జేసీ కమిటీ నిర్ణయం..

Andhra Pradesh: విశాఖ జిల్లాలో భూముల విలువ పెంపునకు కసరత్తు.. ప్రజల నుంచి అభ్యంతరాల కోసం రిజిస్ట్రేషన్ల శాఖ ఇలా..
Land
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 02, 2022 | 9:04 AM

విశాఖ జిల్లాలో(visakhapatnam Dist) భూముల విలువ(Lands) పెంపునకు రిజిస్ట్రేషన్ శాఖ(Property registration) కసరత్తు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు(registration rates) వసూలుకు నిర్ణయం తీసుకుంది. ప్రాంతాల ప్రాధాన్యత ఆధారంగా పెంచేందుకు ఇప్పటికే జేసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. 10 నుంచి అత్యధికంగా 40 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు JC కమిటీ తెలిపింది. ఈమేరకు ఇవాళ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనుంది రిజిస్ట్రేషన్ల శాఖ. అంతేకాకుండా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది రిజిస్ట్రేషన్ శాఖ. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు వసూలు.. ఈ నెల నుంచి అమల్లోకి తెస్తామని చెప్పారు అధికారులు.

విశాఖ జిల్లాలో భూముల విలువల పెంపునకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు పూర్తి చేసింది. సాధారణంగా ప్రతీ యేటా ఈ ప్రక్రియ ఉంటుంది. కానీ 2021 లో కరోనా కారణంగా రిజిస్ట్రేషన్ లు లేకపోవడంతో పెంచలేదు. అయితే ఈ సారి 10 శాతం నుంచి అత్యధికంగా 40 శాతం వరకు ప్రాంతాల ప్రాధాన్యత ఆధారంగా పెంచాలని జేసి కమిటీ నిర్ణయం తీసుకుంది.

మార్చిలో అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో.. అవి ముగిసేవరకు అమలు చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి రావొచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Summer Health Tips: వేసవిలో ఆ నీరే అమృతం.. కుండ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

Hair Care Tips: డ్రై హెయిర్‌తో ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..