Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధర ఎంత? మీ నగరంలో పెరిగిన, తగ్గిన వివరాలు ఇదిగో

మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధరలకు 100 డాలర్లకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లే, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనాలపై వ్యాట్‌ను కూడా తగ్గించాయి. తద్వారా మహానగరంలో..

Petrol Diesel Price: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధర ఎంత? మీ నగరంలో పెరిగిన, తగ్గిన వివరాలు ఇదిగో
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 03, 2022 | 8:52 AM

గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌(Petrol ), డీజిల్‌ (Diesel)ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. ఇలా స్థిరంగా కొనసాగుతుండటంతో వాహనదారులకు ఊరట కలిగిస్తుందనే చెప్పాలి. ఇక రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తత (Russia Ukraine war)ల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ (Petrol, Diesel)ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు చమురు(Crude Oil) ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధరలకు 100 డాలర్లకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లే, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనాలపై వ్యాట్‌ను కూడా తగ్గించాయి. తద్వారా మహానగరంలో అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయినా కూడా దేశంలోని 25 ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర రూ.100 పైనే ఉంది.

ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరల సవరణ

పెట్రోలు, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాలు కలిపితే దాని ధర రెట్టింపు అవుతుంది. ఈ ప్రమాణాల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ప్రతినిధి కొత్త రేట్లు ఉదయం 6 గంటలకు సెట్ చేయబడ్డాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అంతర్జాతీయ ప్రమాణాలు, విదేశీ మారకపు ధరలతో ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.85గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.94గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.29గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.66గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.05గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.47 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.83గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.51 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.84గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.91గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.03గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.51లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.59లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.14 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.68గా ఉంది.

ఇవి కూడా చదవండి: Summer Health Tips: వేసవిలో ఆ నీరే అమృతం.. కుండ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

Hair Care Tips: డ్రై హెయిర్‌తో ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..