AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Market Update: మళ్లీ మెుదటికి.. యుద్ధ భయాల్లో మార్కెట్లు.. ఆరంభంలోనే పతనం..

Market Update: యుద్ధం నిలువరించేందుకు చేస్తున్న చర్చలు, ప్రయత్నాలు ఎటువంటి సానుకూల పరిష్కారాన్ని ఇవ్వకపోవటంతో భారత మార్కెట్లు మళ్లీ నెగటివ్ లోనే ప్రారంభమయ్యాయి. దీంతో భారత మార్కెట్లు సైతం ఆరంభంలోనే పతనమయ్యాయి.

Market Update: మళ్లీ మెుదటికి.. యుద్ధ భయాల్లో మార్కెట్లు.. ఆరంభంలోనే పతనం..
Stock Market
Ayyappa Mamidi
|

Updated on: Mar 02, 2022 | 9:33 AM

Share

Market Update: యుద్ధం నిలువరించేందుకు చేస్తున్న చర్చలు, ప్రయత్నాలు ఎటువంటి సానుకూల పరిష్కారాన్ని ఇవ్వకపోవటంతో భారత మార్కెట్లు మళ్లీ నెగటివ్ లోనే ప్రారంభమయ్యాయి. ముందుగా వారం ప్రారంభంలో సూచీలు పతనమైనప్పటికీ రోజు చివరికి కొనుగోళ్లు ఊపందుకోవటంతో లాభాల్లోనే ముగిశాయి. కానీ.. సెలవు తరువాత నేడు తిరిగి ప్రారంభమైన మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పతనం కాగా.. జాతీయ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పతనమైంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగటం, ఆసియా మార్కెట్లు కూడా పతనమవటంతో మన దేశంలోనూ అదే ఒరవడి కొనసాగింది. బ్యాంక్ నిష్టీ సూచీ 850 పాయింట్లు పతనం కాగా, మిడ్ క్యాప్ సూచీ స్వల్ప నష్టాల్లో ఉండగా.. మెటల్ స్టాక్స్ మాత్రం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే హిందాల్కో 4.23%, కోల్ ఇండియా 4.13%, ఓఎన్జీసీ 4.01%, టాటా స్టీల్ 3.01%, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1.69%, జేఎస్డబ్యూ స్టీల్ 1.59%, బీపీసీఎల్ 1.53%, యూపీఎల్ 1.33%, అదానీ పోర్ట్స్ 0.84% షేర్లు లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

బజాజ్ ఆటో విడుదల చేసిన వివరాల మేరకు కంపెనీ సేల్స్ 16 శాతం మేర పడిపోయింది. వాహన అమ్మకాలు 3.16 లక్షల యూనిట్లుగా నిలిచాయి. ఇదే వాహనాల అమ్మకాలు గత సంవత్సరం 3.75 లక్షల యూనిట్లుగా ఉంది.

ఇవీ చదవండి..

Grand Son On Will: తాత రాసిన వీలునామాపై మనవడు కోర్డుకు వెళ్లవచ్చా..? చట్టపరంగా ఆస్తి దక్కించుకోవటం ఎలాగో తెలుసుకోండి..

Russia-Ukraine war Effect: రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం భారత్ పై ఎంత.. వాణిజ్యంలో రెండు దేశాలు పరస్పరం ఎంతమేర ఆధారపడ్డాయి..