Viral Video: వామ్మో.. మీ కళ్లను మీరే నమ్మలేరు.. ఈ మ్యాజిక్ ట్రిక్ ఏంటో మీరు కనిపెడితే మీరు జీనియస్..
Man's Magic Trick: సోషల్ మీడియాలో నిత్యం పలు రకాల వీడియోలు వైరల్ అవతున్నాయి. తాజాగా ఓ మ్యాజిక్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లంతా
Man’s Magic Trick: సోషల్ మీడియాలో నిత్యం పలు రకాల వీడియోలు వైరల్ అవతున్నాయి. తాజాగా ఓ మ్యాజిక్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లంతా ఒక్కసారిగా నోరెళ్లబెడుతున్నారు. షుగర్ సాచెట్‌తో ఒక వ్యక్తి చేసిన ‘మ్యాజిక్ ట్రిక్’ నెటిజన్లను తెగ అబ్బురపరుస్తోంది. ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్‌గా మారిన ఫుటేజీలో ఒక వ్యక్తి పెట్రోల్ పంపు వద్ద నిలబడి ఉంటాడు. అయితే.. ఆ వ్యక్తి షుగర్ సాచెట్‌ని కట్ చేసి.. పిడికిలిలో బిగించిన తన ఎడమ చేతిలో పంచదార పోసాడు. ఖాళీ పొట్లాన్ని నోటితో పట్టుకుని పంచదారను గాలిలోకి విసిరి వేస్తాడు. ఆ తర్వాత తన ఖాళీ చేతులను చూపుతూ.. ఏదో మ్యాజిక్ చేస్తాడు. గాలిలోని నుంచి పంచదారను మళ్లీ తన చేతినుంచి తెప్పించి షుగర్ సాచెట్‌లో పోస్తాడు.
అందులో ఉన్న మ్యాజిక్ ట్రిక్ ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. కానీ అందులో ఉన్న రహస్యాన్ని మాత్రం కనుగొనలేక చేతులెత్తేస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ (Viral Video) వీడియోను నెటిజన్లు తమ సన్నిహితులకు, స్నేహితులకు షేర్ చేయడంతో నెట్టింట అది వైరల్‌గా మారిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ మ్యాజిక్ ట్రిక్ ఏంటో కనిపెట్టి జీనియస్‌గా మారిపోండి..
వైరల్ వీడియో..
I’ve watched this 57 times and still can’t figure it out ?? (via jadon.ray/TT) pic.twitter.com/TjsFrm7Udg
— Overtime (@overtime) February 25, 2022
వైరల్ అవుతున్న మ్యాజిక్ వీడియోను చూసి నెటిజన్లంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 50లక్షల మందికి పైగా వీక్షించారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మొదట TikTokలో @jadon.ray అనే యూజర్ షేర్ చేశారు. ఆ తర్వాత మిలియన్ల మంది దీనిని షేర్ చేశారు. చాలా మంది వీక్షకులు మ్యాజిక్ ట్రిక్‌పై స్పందిస్తూ.. గందరగోళంగా ఉందంటూ పేర్కొంటున్నారు.
రహస్యం ఏంటో ఎంత వెతికినా కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ప్రొఫెషనల్ మెజీషియన్‌కు కూడా ఈ వీడియో అంతుచిక్కకుండా మారిందంటూ మరో యూజర్ పేర్కొనగా.. షుగర్‌ను బొటనవేలు ద్వారా దాచిపెట్టాడని పేర్కొన్నాడు.
Also Read: