AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తాతతోనే ఉంటా.. విడిచి వెళ్లలేక చిన్నారి కంట కన్నీరు.. వైరలవుతోన్న వీడియో

ఒక చిన్నారి తన తాతయ్యను విడిచి వెళ్లలేక పాపం బిక్క మోహం వేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా చిన్నారి ప్రేమకు కరిగిపోతూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: తాతతోనే ఉంటా.. విడిచి వెళ్లలేక చిన్నారి కంట కన్నీరు.. వైరలవుతోన్న వీడియో
Girl Tearful Goodbye To Her Grandpa Viral Video
Venkata Chari
|

Updated on: Mar 02, 2022 | 12:35 PM

Share

Trending Video: సోషల్ మీడియాలో ఎన్నో వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. అయితే ఓపాత వీడియో ఒకటి మరోసారి తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఉన్న చిన్నారి అమాయకపు ప్రేమకు మీరు కూడా బాధపడడం ఖాయం. మీ హృదయాన్ని ద్రవింపజేస్తుందనడంలో సందేహం లేదు. మూడేళ్ల కామీ ఇన్‌స్టాగ్రామ్‌లో 131k ఫాలోవర్లతో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. ఆమె తల్లి, కోలెట్ లూయిస్, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తుంది. తరచుగా చిన్న పిల్లలు ఉన్న అందమైన వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తుంది. మార్చి 2021లో కామీ, ఆమె తాతతో కలిసి షేర్ చేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నెటిజన్లను కరిగిపోయేలా చేస్తోంది.

సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయిన ఈ వీడియోలో.. ఈ చిన్నారి కారు వెనుక సీటులో కూర్చొని ఉంది. ఆమె తన తాతకు ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం చూడవచ్చు. తన తాతయ్యను విడిచి వెళ్లడం ఇష్టంలేకపోవడంతో దీనంగా బైబై చెప్పి బోరున విలపించింది. ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. కామీ తన తాతతో అద్భుతమైన బంధాన్ని పంచుకుందనడానికి ఈ వీడియోనే కచ్చితమైన రుజువుగా నిలుస్తుంది.

ఈ వీడియోకు “మీరు మీ బెస్ట్ ఫ్రెండ్, తాతని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు” అంటూ క్యాఫ్షన్ అందించారు. ఈ వీడియో ఇంటర్నెట్‌ను కూడా బాధించేలా చేసింది. ఈ మేరకు ఎంతోమంది యూజర్లు తమ భావాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. “ఇది నన్ను కంటతడి పెట్టించింది. స్వీటెస్ట్ మోస్ట్ ఆరాడబుల్ బేబీ ఏంజెల్” అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.

View this post on Instagram

A post shared by Cami Louis (@camifrobabe)

Also Read: Viral Video: ఇదేందిరయ్యా.. ప్రెగ్నెంట్ ఆరెంజ్ అంట.. లోపల చూస్తే మైండ్ బ్లాకే..

Viral Video: 90 ఏళ్ల బామ్మకు బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఆమె ఆనందాన్ని చూస్తే మీ కంట కన్నీరు ఆగదు..