- Telugu News Photo Gallery World photos Couple Swapped Normal Life In Three Bedroom Flat To School Bus Viral Photos Simply Shocks You
Viral News: ఇదేందిది.! అదిరిపోయే ఫ్లాట్‌ను వదిలేసి స్కూల్ బస్‌లో మకాం.. లోపల చూస్తే షాకే..
ప్రతీ ఒక్కరికీ విలాసవంతమైన జీవితం గడపాలని ఉంటుంది. బోలెడంత డబ్బు.. పెద్ద ఇల్లు.. ఇలా ఎవరి కల వారిది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల...
Updated on: Mar 02, 2022 | 12:28 PM

ప్రతీ ఒక్కరికీ విలాసవంతమైన జీవితం గడపాలని ఉంటుంది. బోలెడంత డబ్బు.. పెద్ద ఇల్లు.. ఇలా ఎవరి కల వారిది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల. ఈ జంటది కూడా అంతే. కానీ కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించారు. తమకంటూ ఓ స్పెషల్ ఇంటిని కట్టుకున్నారు. ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం పదండి..

అసలు విషయంలోకి వెళ్తే.. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన కేటీ, సామ్‌లు డిసెంబర్ 2020లో ఓ స్కూల్ వ్యాన్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత వారు తాము ఉంటున్న విలాసవంతమైన 3 BHK ఫ్లాట్‌ను వదిలేసి.. ఈ వ్యాన్‌లో నివసించాలని నిర్ణయించారు.

అయితే ఆ స్కూల్ వ్యాన్ సాదాసీదాది కాదండోయ్.. లోపలికి వెళ్లి చూస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ స్కూల్ వ్యాన్ ఇంటీరియర్‌ను ఈ ఇద్దరూ ఓ ఇంటిలా మార్చారు. అదంతా జరగడానికి సుమారు సంవత్సరం టైం పట్టింది. ఇక ఇప్పుడు ఆ వ్యాన్‌లో ఓ పడకగది, వంటగది, బాత్రూమ్, డైనింగ్ రూమ్ ఉన్నాయి.

తాము స్వేచ్చా జీవితాన్ని ఇష్టపడటామని.. అందుకే ఈ వ్యాన్‌ను తమ ఇంటిగా మార్చుకున్నామని కేటీ, సామ్‌లు తెలిపారు. ఈ వ్యాన్‌తో అమెరికాలోని వివిధ ప్రాంతాలకు అప్పుడప్పుడూ టూర్‌కు వెళ్తుంటాం అని అన్నారు.

ది సన్ పత్రికలో ప్రచురించిన కథనం ప్రకారం.. ఈ జంట గతంలో చార్లెస్టన్‌లోని 3 BHK ఫ్లాట్‌లో అద్దెకు ఉండగా.. ఆ తర్వాత సీయాటల్‌లోని 2 BHK ఫ్లాట్‌లో మారారు. ఆపై సెయింట్ పీట్‌లో ఈ స్కూల్ వ్యాన్ కొనుగోలు చేసి.. ఇప్పుడు తమ ఇంటిగా మార్చుకున్నారు.
