AP Crime: మాట్లాడుకుందామని పిలిచి.. హోటల్ రూంకు తీసుకుళ్లాడు.. ఆ తర్వాత భార్యను ఏం చేశాడంటే
పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త.. భార్యను హత్య చేయాలని భావించాడు. ఫథకం ప్రకారం మాట్లాడుకుందాం...
పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త.. భార్యను హత్య చేయాలని భావించాడు. ఫథకం ప్రకారం మాట్లాడుకుందాం రమ్మని చెప్పి, నమ్మించాడు. అతని మాటలు విన్న భార్య భర్త వద్దకు వెళ్లింది. హోటల్ లో ఓ గదిని అద్దెకూ తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తే భార్యను హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల (Kanchikacharla) కు చెందిన ప్రసాదరావు దుబాయ్‌లో పని చేస్తుంటారు. అతనికి షరూన్ పరిమళ అనే యువతితో వివాహమైంది. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో వీరు విడివిడిగా ఉంటున్నారు. భర్త వేధింపులు తాళలేక పరిమళ గతేడాది అక్టోబరులో కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు (Complaint) చేసింది. అయితే ఈ కేసు గురించి మాట్లాడుకుందామని భార్యను నమ్మించిన ప్రసాదరావు ఆమెను విజయవాడ (Vijayawada) కు పిలిచాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పాత బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్‌లో గది తీసుకున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో జ్యూస్ కోసం బయటకు వెళ్లాడు.
ఎంతకీ తిరిగి రాకపోవటంతో లాడ్జి రిసెప్షనిస్ట్ ప్రసాదరావుకు ఫోన్ చేశాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రసాదరావు కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్యను హత్య చేశానని చెప్పి, పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడి పోలీసులు గవర్నర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. మంచంపై పరిమళ చనిపోయి పడి ఉంది. ముఖంపై దుప్పటి కప్పి ఉంది. దుప్పటి తీసి చూడగా, ఆమె గొంతుపై లోతైన గాయంతో విగతజీవిగా కనిపించింది. రిసెప్షనిస్ట్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కొత్తాసుపత్రి మార్చురీకి తరలించారు. పరిమళ హత్య వార్త విని పెద్ద ఎత్తున బంధువులు విజయవాడకు చేరుకున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
Also Read
వింత కేసు! మహా శివుడికి జిల్లా కోర్టు నోటీసులు జారీ.. విచారణకు హాజరవ్వకపోతే రూ.10వేలు జరిమానా?
Varsha Bollamma: కోర చూపులతో కవిస్తున్న వర్ష బొల్లమ్మ లేటెస్ట్ ఫోటోస్