Andhra: ప్రేమించుకుందామన్నాడు.. కట్ చేస్తే.. పెళ్లికి వద్దు పొమ్మన్నాడు.. ఆమె ఏం చేసిందంటే.?
ఆ సమయంలో భాను ప్రకాష్ వారి వద్దకు వచ్చి తాను, భవానీ దుర్గ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం.. పెళ్ళిచేసుకుంటానని యువతి తల్లిదండ్రులతో చెప్పాడు. భాను ప్రకాష్ కుటుంబ సభ్యుల అంగీకరంతో ముందు కుదిర్చిన సంబంధాన్ని రద్దు చేసి ఆరు నెలల్లో భాను ప్రకాష్, భవాని దుర్గల పెళ్ళి చేసేలా ఒప్పందం అయ్యారు.

ప్రేమ – పెళ్లి ఇవి రెండూ అవినాభావ సంబంధమైనవి. యువతీ యువకులకు స్నేహం, ప్రేమ అనే రెండు బంధాల మధ్య తేడా గుర్తించి మెలగాల్సి ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో సంబంధాలు కొనసాగించడం సమస్యాత్మకంగా మారుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలానికి చెందిన యువతి ఇప్పుడు ప్రియుడు ఇంటి ముందు నిరసన దీక్ష చేపడుతోంది. వివరాల్లోకి వెళితే.. రామచంద్రపురం గ్రామానికి చెందిన కరణం భాను ప్రకాష్, గంధం భవాని దుర్గ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే భవానీ దుర్గకు కొన్ని నెలల క్రితం వేరే సంబంధాన్ని ఆమె తల్లిదండ్రులు చూసారు. వరుడికి కొంత మొత్తం పసుపు, కుంకుమ రూపంలో ఇచ్చారు.
ఆ సమయంలో భాను ప్రకాష్ వారి వద్దకు వచ్చి తాను, భవానీ దుర్గ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం.. పెళ్ళిచేసుకుంటానని యువతి తల్లిదండ్రులతో చెప్పాడు. భాను ప్రకాష్ కుటుంబ సభ్యుల అంగీకరంతో ముందు కుదిర్చిన సంబంధాన్ని రద్దు చేసి ఆరు నెలల్లో భాను ప్రకాష్, భవాని దుర్గల పెళ్ళి చేసేలా ఒప్పందం అయ్యారు. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు.. గ్రామపెద్దల సమక్షంలో అంగీకార పత్రం రాయించుకున్నారు. ఇది జరిగి ఎనిమిది నెలలు అయ్యింది. యువతి పెళ్లి గురించి అడిగితే ప్రియుడు నుంచి, అతని కుటుంబ సభ్యుల నుంచి సరైన సమాధానం రాలేదు. పెద్దల మాట లెక్కచేయకుండా మీకు దిక్కున చోట చెప్పుకోమన్నారని యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏంచేయాలో తెలియని యువతి.. ప్రియుడు ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. తమకు న్యాయం చేయాలని యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.




