Andhra Pradesh: మహిళ ముఖంపై రాయితో కొట్టి.. వివస్త్రను చేసి.. బాబోయ్‌ ఎంత ఘోరం!

పొద్దున్నో పశువులను తీసుకుని మేతకు పొలాలాకు వెళ్లిన స్థానికులకు దారుణ ఘటన కనిపించింది. ఓ మహిళ దారుణ స్థితిలో పొలాల్లో కనిపించింది. ఆమె అక్కడికి ఎలా వచ్చిందో.. ఎవరు తీసుకువచ్చారో తెలియక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు..

Andhra Pradesh: మహిళ ముఖంపై రాయితో కొట్టి.. వివస్త్రను చేసి.. బాబోయ్‌ ఎంత ఘోరం!
Woman Brutally Murdered In Kadapa
Follow us
Sudhir Chappidi

| Edited By: Srilakshmi C

Updated on: Nov 21, 2024 | 7:35 PM

కడప, నవంబర్ 21: ఓ మహిళను కొందరు వ్యక్తులు అతి దారుణంగా చంపి, వివస్త్రను చేసి.. గుర్తుపట్టకుండా ముఖాన్ని రాయితో కొట్టి నుజ్జు నుజ్జు చేశారు. ఈ దారుణ సంఘటన కడప జిల్లాలో కలకలం రేపుతుంది. ఉదయం పశువుల కాపర్లు పశువులను అటువైపుగా తీసుకువెళ్లగా వారికి మృతురాలు కనబడడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ మహిళను ఓ వ్యక్తి అక్కడికి తీసుకువచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనిపై జిల్లా ఇన్చార్జి ఎస్పీ మాట్లాడుతూ..

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన మండలం పాపిరెడ్డి పల్లి మధ్య వ్యవసాయ పొలాల్లో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. అయితే ఆ మహిళలను చూసిన వారికి ఎవరికైనా అయ్యో పాపం అనిపించాల్సిందే. ఆ మహిళను వివస్త్రను చేసి మొహంపై రాయితో కొట్టి చంపినట్లుగా కనబడుతుంది. ఈరోజు ఉదయం కొంతమంది పశువుల కాపరులు అటుగా వెళ్లడంతో వారికి చనిపోయిన మహిళ కనబడింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గురైన మహిళది ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చాపాడు మండలం ఖాదరపల్లికి చెందిన కరిమున్నీసాగా పోలీసులు గుర్తించారు. ఆమె చేతి పై ఉన్న టాటూ ఆధారంగా ఆవిడను గుర్తించినట్లు మైదుకూరు బీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా సంఘటన స్థలానికి క్లూస్ టీం పిలిపించి వివరాలు సేకరించారు.

అయితే మహిళను ఓ వ్యక్తి అక్కడకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇదే విషయంపై జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. ఆల్మోస్ట్ కేసును చేదించామని ఒక వ్యక్తి ద్వారా ఆ మహిళ ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు. అతను దొరికితే పూర్తి వివరాలు సేకరించి, దోషులను త్వరలోనే పట్టుకుంటామని ఇన్చార్జి ఎస్పీ అన్నారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేశారా? లేదా హత్య మాత్రమే చేశారా? అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా హత్య అక్కడే జరిగిందా? లేదా వేరే చోట ఎక్కడైనా హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పడేశారా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తం మీద మహిళను అతి దారుణంగా అతి కిరాతకంగా చంపిన ఆనవాళ్లు స్పష్టంగా కనబడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో