Mahesh Babu-Rajamouli: జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్లే ఉంటుంది ప్రతీసారి రాజమౌళి సినిమాల ముచ్చట. ఆయన కొత్త సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు రోజుకో వార్త బయటికి వస్తూనే ఉంటుంది. ఎన్ని వార్తలొచ్చినా.. తనకు ఫ్రీగా ప్రమోషన్ వస్తుందని కామ్‌గా అలా చూసి ఎంజాయ్ చేస్తుంటాడు జక్కన్న. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. మహేష్ బాబు సినిమా గురించి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క అఫీషియల్ అప్‌డేట్ కూడా ఇవ్వలేదు రాజమౌళి.
డిసెంబర్‌లోనే సినిమా ఓపెనింగ్ అన్నారు.. అన్నీ కుదిర్తే జనవరి తర్వాత షూటింగ్ అన్నారు. కానీ ఇప్పుడు సీన్ చూస్తుంటే అలాంటిదేం కనిపించట్లేదు. కనీసం ఇప్పుడుంటుంది.. ఉండబోతుందనే వార్తలుంటాయి కదా.. కనీసం అవి కూడా వినిపించట్లేదు. రాజమౌళి సినిమా అంటే అలాగే ఉంటుందని తెలుసు కానీ అయినా కూడా మనసు ఆగక అలా అడుగుతున్నారు అభిమానులు. ఫ్యాన్స్ బాధ చూడలేక మహేష్ బాబే అప్‌డేట్స్ కాకపోయినా.. కనీసం అప్పుడప్పుడూ వాళ్లకు దర్శనమిస్తున్నాడు. మొన్నటి వరకు గడ్డంతో కనిపించిన మహేష్.. తాజాగా కీరవాణి కొడుకు పెళ్లిలో గుంటూరు కారం లుక్‌లోకి మారిపోయాడు.
మరోవైపు రాజమౌళి మాత్రం, కావాలంటే ఓ ఏడాది ఎక్కువ టైమ్ తీసుకుందాం కానీ క్వాలిటీ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నాడు. మామూలుగానే ఈయన తన సినిమాల కోసం చాలా టైమ్ తీసుకుంటారు. ఇక SSMB29 కోసం ఆ టైమ్ ఇంకాస్త పెరిగేలా కనిపిస్తుంది. మరి మహేష్, జక్కన్న సినిమా సెట్స్‌పైకి వచ్చేదెప్పుడు..? 2024లో ఆ న్యూస్ వినిపిస్తుందా లేదా అనేది అర్థం కావట్లేదిప్పుడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి
తండ్రిని భుజంపై మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..
ప్రమాదకర విన్యాసాలతో హైవేపై రెచ్చిపోయిన యువకులు..
లిఫ్ట్‌లో గ్యాస్ బెలూన్లు తీసుకెళ్తున్న డెలివరీ బోయ్.. అంతలోనే
ఒక్కో ఊరిలో హడలెత్తిస్తున్న ఒక్కో పులి.. ఇక ప్రజలు ఉండేది ఎలా
పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి

