Movie: ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.!

Movie: ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.!

Anil kumar poka

|

Updated on: Nov 21, 2024 | 1:38 PM

ఇప్పుడు సినిమా బిజినెస్‌ ఓ జూదంలా మారింది. ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నామంటే.. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి వస్తుందన్న గ్యారెంటీ అసలు లేదన్న మాటే..! ఇది తెలియన చాలా మంది కొత్త ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు. ఉన్న ప్రొడ్యూసర్లు.. ఉన్నదమ్ముకుని సైలెంట్‌ అయిపోతున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఓ సినిమా కారణంగా ఓ బడా ప్రొడ్యూసర్ తీవ్రంగా నష్టపోయాడు.

తను ప్రొడ్యూస్ చేసిన సినిమా పరమ చెత్త సినిమా అనే ట్యాగ్ వచ్చేలా చేయడంతో.. ఫీలవుతూ కొన్ని రోజులు ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయారు. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. టీ సిరీస్ అధినేత భూషన్ కుమార్. అండ్ ఆ సినిమా మరేదో కాదు.. అర్జున్ కపూర్ హీరోగా చేసిన ద లేడీ కిల్లర్ సినిమా..! ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ద లేడీ కిల్లర్ సినిమాకు 45 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి సినిమా తీస్తే కనీసం లక్ష రూపాయిలు కూడా వసూల్ చేయలేదు. ఎంత చెత్త సినిమా అయినా అంతో ఇంతో వసూల్ చేయాలి.. కానీ ఈ సినిమా లక్ష రూపాయిలు కూడా వసూల్ చేయలేకపోయింది. దాంతో నిర్మాత నిండా మునిగిపోయాడు.

2023లో రిలీజ్ అయిన ద లేడీ కిల్లర్ సినిమాకు అజయ్ బేహల్ దర్శకత్వం వచ్చారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యంత డిజాస్టర్ సినిమాగా ఈ సినిమా నిలిచింది. అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ కలిసి నటించిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం మొత్తంగా 45 కోట్లు ఖర్చు చేశారు మేకర్స్. అలాగే ప్రమోషన్స్ అన్ని కలుపుకొని ఓ రెండు కోట్లవరకు ఖర్చయింది. కానీ బాక్సాఫీస్‌ దగ్గర మినిమమ్ వసూల్ చేయలేకపోయింది. మొత్తం కలుపుకొని సుమారు 70 వేల రూపాయిలు మాత్రమే వసూలు చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.