నానబెట్టిన ఎండుద్రాక్షతో అనేక లాభాలు.. 

TV9 Telugu

21 November 2024

ఎండు ద్రాక్షను ఎంత పరిమాణంలో తినాలంటే వ్యక్తి బరువు, వయస్సు, వ్యాధిని బట్టి ఎండుద్రాక్షను తీసుకోవాలి.

రుచిగా ఉండే నానబెట్టిన ఎండుద్రాక్షను ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా సరైన పరిమాణంలో తినాలి.

ఒకరు ఒకేసారి 5 లేదా 6 ఎండు ద్రాక్ష కంటే ఎక్కువ తినకూడదు. ఐదేళ్ళ లోపు పిల్లలు 4 లేదా 5 కిస్మిస్ కంటే ఎక్కువ తినకూడదు.

పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి అనేక ఖనిజాలు ఎండుద్రాక్షలో ఉంటాయి. ఇది మనిషి శరీరంలో రక్తపోటును స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.

నానబెట్టిన ఎండుద్రాక్షలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది పొట్టను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేసి జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేసేలా చేస్తుంది.

నానబెట్టిన ఎండు ద్రాక్షలో అధిక మొత్తంలో సోడియం ఉండుట వలన రక్తపోటును పెంచవచ్చు. మోతాదులో తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాపర్, విటమిన్ B12 వంటి అనేక పోషకాలు ఎండుద్రాక్షలో ఉంటాయి. దినివల్ల శరీరంలో రక్తహీనత వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

రాత్రిపూట నీటిలో ఎండుద్రాక్షను నానబెట్టడం వల్ల అందులో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పెరుగుతాయి.