లంగ్ క్యాన్సర్‌కి కారణాలు, లక్షణాలు ఇవే..
TV9 Telugu
20 November 2024
ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు కారకాల వల్ల వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
అధిక వాయు కాలుష్యం, పొగాకు కారణంగా కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు.
సిగరెట్ తాగుతున్న వారి చుట్టూ నిలబడి ఉండటం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణం అంటున్నారు నిపుణులు.
అలాగే, వాతావరణం, ఉష్ణోగ్రతలలో మార్పులు కారణంగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ధూమపానం మానేసిన వ్యక్తులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.
ధూమపానం చేసేవారిలోనూ, పొగతాగనివారిలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఒకేలా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మీకు ఎల్లప్పుడూ అలసటగా అనిపించడం, తరచుగా దగ్గు, నోటి నుంచి రక్తం పడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని కలవాలి.
ఛాతి నొప్పి, శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపించిన కూడా వెంటనే మీ వైద్యులను కచ్చితంగా సంప్రదించాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎయిర్ ఫ్రయర్తో ఆయిల్ లెస్ పూరీలు ఎలా చేయాలంటే?
కొత్తిమీరతో అనారోగ్యం నో.. ఆ సమస్యలకు బై..
శీతాకాలంలో కుంకుమ పువ్వుతో అనారోగ్యం పరార్..