వంటగదిలో స్టోర్ చేసుకునే కూరగాయల్లో కొత్తిమీర ఆకుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాల్లో కొత్తిమీర వేయడం ద్వారా మంచి రుచి, వాసన రెండూ వస్తాయి.
అనేక రకాల వ్యాధులకు చెక్‌పెట్టే ఔషధ గుణాలు కొత్తిమీరలో దాగి ఉన్నాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
పచ్చి కొత్తిమీర రక్తంలో షుగర్ లేవల్స్‌ను నియంత్రించడంలో దివ్యౌషధంగా పని చేస్తుంది. కొత్తిమీరలో కిడ్నీలకు మేలు చేసే అనేక ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి.
పచ్చి కొత్తిమీర జీర్ణశక్తిని పెంచి, కడుపులో సమస్యలను నివారించడంలో బాగా పని చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
పచ్చి కొత్తిమీరలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు ఉండటం వల్ల వేగంగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు.
కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తి ధనియాల గింజలను ఉడికించిన నీటిని తాగడం వల్ల మంచి ఫలితం పొందుతారు.
శరీరంలో రక్తహీనత అరికట్టేందుకు కావాల్సిన ఐరన్ కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పచ్చి కొత్తిమీరలో సమృద్ధిగా ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది, కొన్ని కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.