కాఫీ తాగేవారు ఈ తప్పులు అస్సలు చేయవద్దు.. 

19 November 2024

TV9 Telugu

అధిక బరువు కారణంగా చాలామంది పూరీ అంటే ఇష్టం ఉన్న కూడా ఆయిల్ ఉన్నందున తినలేకపోతున్నారు. వారికోసం పూరి ఆయిల్ లేకుండా చేయవచ్చు.

బరువు తగ్గాలనుకునే వారు, డైటింగ్​ చేసే వారికి ఆయిల్‌ లేకుండా పూరీలు చేయడం సాధ్యం. అదెలాగో తెలుసుకుందామా

ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్ లో కప్పు గోధుమ పిండి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ పై పిండిలో పెరుగు వేసుకుని మరోసారి మిక్స్​ చేయాలి.

కొద్దికొద్దిగా అవసరమైనంత నీరు పోసుకుంటూ..చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత బౌల్​పై మూత పెట్టి 20 నిమిషాలు అలా ఉంచాలి.

తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక పిండి ముద్దను చపాతీ పీటపై వేసి కాస్త మందంగా చపాతీ కర్రతో పూరీలు ప్రిపేర్​ చేసుకోవాలి.

గిన్నెలో 2 గ్లాసుల నీటిని పోయండి. నీరు బాగా మరుగుతున్నప్పుడు పూరీలను వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. పూరీలు నీటిపై తేలగానే ప్లేట్లోకి తీసుకోవాలి.

ఇలా అన్ని పూరీలను వాటర్​లో కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మూడు చొప్పున ఎయిర్‌ ఫ్రైయర్‌లో 2 నిమిషాలు ఉంచి తీసేయాలి.

అంతే.. ఇలా సింపుల్​గా చేసుకుంటే.. పూరీలు ఆయిల్​ లేకుండానే సూపర్​ టేస్టీగా రెడీ అవుతాయి. ఈ వేడివేడి పూరీలను తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.