AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు వేసి పడుకోబెట్టింది.. ఆ తర్వాత ప్రియుడ్ని పిలిచింది.. కట్ చేస్తే

మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్త ఉంటే ఆ వ్యవహారం సరిగ్గా కుదరడం లేదు. అందుకే అతడ్ని లేపేయాలని డిసైడయ్యింది. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసింది.. కానీ...

Vizianagaram: భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు వేసి పడుకోబెట్టింది.. ఆ తర్వాత ప్రియుడ్ని పిలిచింది.. కట్ చేస్తే
Mutton Biryani
Ram Naramaneni
|

Updated on: Jul 07, 2023 | 3:32 PM

Share

మాయదారి వివాహేతర సంబంధాల మాయలో పడి క్రైమ్ చేసేందుకు కూడా వెనకాడటం లేదు కొందరు. పిల్లల భవిష్యత్‌ను కూడా పట్టించుకోవడం లేదు. వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసిన.. భాగస్వాములను పరాయివాళ్ల మోజులో చంపేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా విజయనగరంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కుమ్మరివీధిలో నివాసం ఉండే కోటరాజుకు భార్య శ్రీదేవి, పిల్లలు ఉన్నారు. వీరంతా బుధవారం రాత్రి వేళ రోజూలానే  నిద్ర పోయేందుకు రెడీ అయ్యారు. పడుకునే ముందు భర్తకు భార్య ప్రేమగా మటన్ బిర్యానీ పెట్టింది. ట్విస్ట్ ఏంటంటే అందులో నిద్రమాత్తలు కలిపింది. భర్త నిద్రలోకి జారుకున్నాక ఎన్నాళ్ల నుంచో వివాహేతర సంబంధం నెరపతున్న ప్రియుడు చిన గోకవీధికి చెందిన గంధవరపు రఘును ఇంటికి పిలిచింది.

అతడితో కలిసి భర్తను ఖతం చేయాలని పక్కాగా స్కెచ్ వేసింది. నిద్రమాత్రలు కూడా ప్రియుడి ద్వారా అంతకుముందే తెప్పించింది. ఇంకేముంది కోటరాజు మెడకు నైలాన్‌తాడు బిగించి చంపేందుకు ఇద్దరూ యత్నించారు. అతడికి మెలుకువ రావడంతో బిగ్గరగా కేకలు వేశాడు. దీంతో ఇద్దరూ పారిపోయారు. వెంటనే  టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కోటరాజు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. వారికి బొగ్గులదిబ్బకు చెందిన కేత శ్రీను అనే వ్యక్తి కూడా సాయం చేసినట్లు గుర్తించి అతడిని కూడా రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!