Andhra Pradesh: మద్యం మత్తులో దారుణం.. భర్త మర్మాంగాన్ని కోసి.. గుట్టుచప్పుడు కాకుండా..!
ప్రకాశం జిల్లాలో జరిగింది. భర్త వేధింపులు తట్టులేక రెండో భార్య అతని మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో జరిగింది. భర్త వేధింపులు తట్టులేక రెండో భార్య అతని మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్‌కు చెందిన విజయ్ యాదవ్ గత కొద్దిరోజులుగా ప్రకాశంజిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో ఓ పశువుల డైరీ ఫామ్‌లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న బీహార్‌కే చెందిన సీతా కుమారి అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అప్పటికే పెళ్ళిైన విజయ్ యాదవ్ తన భార్యను బీహార్‌లోని స్వగ్రామంలో ఉంచాడు. ఇక్కడ సీతా కుమారితో సంబంధం పెట్టుకుని ఆమెను రెండో పెళ్ళి చేసుకున్నాడు.
అయితే గర్భవతి అయిన సీతాకుమారి తనను విజయ్ యాదవ్ సరిగా పట్టించుకోవడం లేదన్న కారణంగా తరచూ అతనితో గొడవ పడుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న విజయ్ యాదవ్‌కు, సీతాకుమారికి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. దీంతో సీతాకుమారి సహనం కోల్పోయి కత్తితో విజయ్ యాదవ్ దాడి చేసింది. ఏకంగా కత్తితో మర్మాంగాన్ని కోసేంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ విజయ్‌ను చూసి భయంతో తన డెయిరీ ఫామ్ యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పి పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ విజయ్‌ను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితురాలు సీతాకుమారి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..