AP News: తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయం భయంగా అటు వెళ్లి చూస్తే
రాజోలు దీవిలో రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి ఇళ్లలోకి విష సర్పాలు చొచ్చుకు వస్తున్నాయి. తాటిపాకలో సరెళ్ల శ్రీనివాసరావు వెల్డింగ్ షాపులో కరెంట్ మీటర్‌లోకి 6 అడుగుల త్రాచు పాము దూరింది. ఆ తర్వాత జరిగిందిదే..
రాజోలు దీవిలో రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి ఇళ్లలోకి విష సర్పాలు చొచ్చుకు వస్తున్నాయి. తాటిపాకలో సరెళ్ల శ్రీనివాసరావు వెల్డింగ్ షాపులో కరెంట్ మీటర్‌లోకి 6 అడుగుల త్రాచు పాము దూరింది. ఉదయం యధావిధిగా షాప్ తెరుచుకుని వెల్డింగ్ పనులు చేసుకుందామనే ప్రయత్నంలో ఉండగా.. కరెంట్ మీటరు నుంచి బుసలు కొడుతున్న శబ్దాలు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు షాపు యజమాని శ్రీనివాసరావు. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించాడు. అతడు ఘటనాస్థలికి చేరుకుని.. చాకచక్యంగా ఆ నాగుపామును బయటికి తీసి.. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలో విడిచిపెట్టాడు. దీంతో బ్రతుకు జీవుడా.. అంటూ ఊపిరి పీల్చుకున్నాడు సదరు షాప్ యజమాని.
ఇది చదవండి: అల్పపీడనం ఎఫెక్ట్.. వచ్చే 2 రోజులు జోరున వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

