అయ్యో.. తిరుపతి జూలో ఇక సమీర్ కనిపించదు.. అసలేం జరిగిందంటే..
తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో వైట్ టైగర్ సమీర్ మృతి చెందింది. వృద్ధాప్య సమస్యలు, పలు రోగాలు కారణంగా వైట్ టైగర్ సమీర్ మృతి చెందినట్లు జూలాజికల్ పార్క్ అధికార వర్గాలు స్పష్టం చేసాయి. దాదాపు 19 ఏళ్ల వయస్సున్న పెద్ద పులి సమీర్.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో వైట్ టైగర్ సమీర్ మృతి చెందింది. వృద్ధాప్య సమస్యలు, పలు రోగాలు కారణంగా వైట్ టైగర్ సమీర్ మృతి చెందినట్లు జూలాజికల్ పార్క్ అధికార వర్గాలు స్పష్టం చేసాయి. దాదాపు 19 ఏళ్ల వయస్సున్న పెద్ద పులి సమీర్.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. దీని కారణంగా చాలా కాలం పాటు జూ వైద్యుల సంరక్షణలో ఉన్నది. శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, పాథాలజీ విభాగం వైద్యుల బృందం నిర్వహించిన పోస్ట్ మార్టమ్ పరీక్షలో మూత్రపిండాల్లో నీటి నిల్వ ఉండటంతో పాటు వృద్ధాప్యం కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించారు.
2011లో ఏళ్ల వయస్సులో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుండి వైట్ టైగర్ సమీర్ ను తిరుపతి జూలాజికల్ పార్క్ కు తరలించారు. 14 ఏళ్ళపాటు పార్క్ లో ఉన్న వైట్ టైగర్ సమీర్ వృధ్యాప్యం, అనారోగ్య కారణాలతో గత ఏడాదిగా సందర్శకులకు దూరంగా ఉంది.
జూ వెటర్నరీ బృందం నిరంతర పర్యవేక్షణలో ఉన్న వైట్ టైగర్.. గత మూడు నెలలుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు జూ వర్గాలు సోమవారం తెలిపాయి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
