AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాడర్‌ ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చేసిందా.. కడప నుంచే భవిష్యత్‌కు బాటలు?

శక్తి మార్పిడికి ముందు పెద్ద రాజకీయ యుద్ధమే జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. ఆనాటి రణరంగానికి యువగళం అని పేరు పెట్టి ఉండొచ్చు కొందరు. లేదా.. పార్టీ అధినేత జైల్లో ఉన్నప్పుడు క్యాడర్‌ చెదిరిపోకుండా ఆనాటి ప్రభుత్వంపై చేసిన పోరాటం కావొచ్చు. అదే ఇప్పుడు పవర్‌ ట్రాన్స్‌ఫర్‌కి ఓ కారణం కాబోతోంది అని పార్టీలో జరుగుతున్న చర్చ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటారో.. లేదా ఇప్పుడే ఎందుకు అని అంటారో తెలీదు గానీ.. ఈ మహానాడులో ఏదో ఒక నిర్ణయం అయితే రాబోతోందని చెబుతున్నారు.

క్యాడర్‌ ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చేసిందా.. కడప నుంచే భవిష్యత్‌కు బాటలు?
Nara Chandrababu Naidu, Nara Loesh
Balaraju Goud
|

Updated on: May 27, 2025 | 9:55 PM

Share

        మహానాడు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆగింది లేదు.. అధికారంలో ఉన్నప్పుడు మిస్ అయిందీ లేదు..! ప్రతి మహానాడు చరిత్రలోకి ఎక్కేలాగే జరిగింది. ఇప్పుడు జరుగుతున్న మహానాడుకు మాత్రం ఏదో ప్రత్యేకత..! కచ్చితంగా చరిత్ర గుర్తుపెట్టుకునేలాగే ఉండబోతోందని ఓ చర్చ. ఇంకా సమయం ఉందని చెప్పడం లేదో.. ఇంకా సమయం ఉందనుకున్నారో గానీ.. మొత్తానికి సమ్‌థింగ్‌ ఈజ్‌ హ్యాపెనింగ్..! మహానాడు.. నాట్‌ జస్ట్‌ ఏ పార్టీ మీటింగ్‌. భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఊహించి, దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుని, వాటిని ఆ క్షణం నుంచే అమలు చేయడానికి జరిగే ఓ రాజకీయ వేదిక. నాలుగు మాటలు, నలుగురి ప్రసంగాలు ఉంటాయని ఏ కార్యకర్త అనుకోడు. భవిష్యత్‌ కార్యాచరణ కోసం ఓ నిర్దిష్ట ప్రణాళికను తీసుకొస్తారనే కచ్చితమైన నమ్మకంతోనే సగటు కార్యకర్త బయల్దేరుతాడు మహానాడుకు. నిజానికి ప్రతి మహానాడు ప్లానింగ్‌ ఇలాగే ఉంటుంది. మరి ఈసారేంటి ప్రత్యేకతా? అదే చెప్పుకోబోతున్నాం. ఒకనాడు 23 లోక్‌సభ సీట్లు గెలిచి.. పార్లమెంట్‌లోనే ప్రధాన ప్రతిపక్షంగా ఓ వెలుగు వెలిగింది తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ చరిత్ర చూడని విధంగా అసెంబ్లీలో కేవలం 23 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఈ స్థాయిలో అప్‌ అండ్‌ డౌన్స్‌ చూసిన పార్టీ మరొకటి లేదు. ఆ క్షణం కార్యకర్తల మెదళ్లలో జరిగిన అంతర్మథనం ఒక్కటే.’ఇక పార్టీ ఉంటుందా అనే’..! కాకపోతే.. పార్టీకేం కాదనే ధీమా. అక్కడున్నది నారా చంద్రబాబు నాయుడు అనే ధైర్యమే ఆ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి