AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలు కాశీబుగ్గ ప్రమాదం ఎలా జరిగింది..? నిర్వాహకుల నిర్లక్ష్యమా..? భక్తుల లోపమా..?

ఏకాదశి వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్టోబర్ 01న కార్తీకమాసం, ఏకాదశికి తోడు శనివారం కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 9మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలీ ప్రమాదం ఎలా జరిగింది...? నిర్వాహకుల నిర్లక్ష్యమా...?

అసలు కాశీబుగ్గ ప్రమాదం ఎలా జరిగింది..? నిర్వాహకుల నిర్లక్ష్యమా..? భక్తుల లోపమా..?
Kasibugga Stampede
Balaraju Goud
|

Updated on: Nov 01, 2025 | 6:32 PM

Share

ఏకాదశి వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్టోబర్ 01న కార్తీకమాసం, ఏకాదశికి తోడు శనివారం కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 9మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలీ ప్రమాదం ఎలా జరిగింది…? నిర్వాహకుల నిర్లక్ష్యమా…? భక్తులు క్రమశిక్షణా లోపమా…? ఆ డీటెయిల్స్‌ ఒకసారి చూద్దాం..!

వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. మేం ముందు అంటే.. మేమే ముందు అంటూ తోసుకున్నారు. ఫలితంగా రెయిలింగ్‌ మీద నుంచి ఒకరి తర్వాత ఒకరు అరుపులు, కేకలతో కింద పడిపోయారు. ఇలా తోపులాట జరగడంతోనే అన్యాయంగా 9మంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం తర్వాత భక్తులను క్లియర్‌ చేశారు. భక్తుల తోపులాటకు మెట్లకున్న రెయిలింగే ఊడి బయటకొచ్చేసింది. కాంక్రీట్‌ మెట్లకు బలంగా బిగించిన రెయిలింగే ఊడి పడిపోయిందంటే ఏ స్థాయిలో తోపులాట జరిగిందో అర్ధం చేసుకోవచ్చు..!

ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుః

1. అసలే ఏకాదశి.. ఎప్పట్లాగే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుసు. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేయాలి. కానీ నిర్వాహకులు అవేం పట్టించుకోనట్లు తెలుస్తోంది. అసలు ఏకాదశి ఏర్పాట్లకు అనుమతులే తీసుకోలేదని ప్రభుత్వం కూడా ప్రకటించింది.

2. మరీ దారుణమేంటంటే.. దర్శనానికి వెళ్లి వచ్చే క్యూలైన్‌ ఒకటే ఉండటం. దేవుడి దర్శనం కోసం ఎంట్రీ, దర్శనం అనంతరం ఎగ్జిట్‌ ఒకటే ఉండటం కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

3. ఆలయంలో ఇంకా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏకాదశి కావడంతో ఓవైపు భక్తులు పెద్దఎత్తున వస్తున్నా కూడా పనులు ఆపకుండా కొనసాగిస్తుండటం కూడా ఓ కారణంగా చెబుతున్నారు అక్కడున్న భక్తులు.

4. అలా నిర్మాణ పనులు జరుగుతున్న చోటే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. అదే నిర్మాణాలు ఆపేసి.. ఎంట్రీ అండ్‌ ఎగ్జిట్‌కు వేర్వేరు క్యూలైన్‌ కేటాయిస్తే ఇంత దారుణం జరిగేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి బాధిత కుటుంబాలు.

5. ఎంట్రీ, ఎగ్జిట్‌ ఒకటే అయినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ అక్కడే నిలువెత్తు నిర్లక్ష్యమే కనిపిస్తోంది.

6. భక్తులు దర్శనానికి వెళ్లే మెట్ల దగ్గర రెయిలింగ్‌ బలహీనంగా ఉండటం.. భక్తులు ఒకరిని ఒకరు తోసుకోవడంతో వీక్‌గా ఉన్న ఆ రెయిలింగ్‌ ఒక్కసారిగా ఊడిపోయింది. ఊహించని నష్టం జరిగింది.

7. అంచనా వేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు నిర్వాహకులు తక్షణ చర్యలు చేపట్టాలి. వాలంటీర్లను పెంచాలి… తోపులాటలు జరగకుండా ఎక్కడికక్కడ రోప్‌లు ఏర్పాటు చేయాలి. కానీ ఆలయంలో అలాంటి ముందస్తు చర్యలేం జరగలేదు.

8. భక్తులు భారీ సంఖ్యలో వచ్చినప్పుడు నిర్వాహకులు ఏం చేయాలి..? వెంటనే భద్రత కోసం పోలీసులను ఆశ్రయించాలి.. కానీ అక్కడ అలాంటిదేం జరగలేదు.

9. నిర్వాహకుల అంచనా 3 వేలు.. వచ్చింది 25 వేలు. సో సింపుల్‌గా చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా 9మంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..