ఏపీ ప్రజలకు అలెర్ట్.. రాగల 3 రోజుల్లో.. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ వివరించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో....

ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ వివరించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో శనివారం, ఆదివారం, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఒకటి, రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం, ఆదివారం రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కోంది. కాగా ఒకవైపు కరోనా వ్యాప్తి, మరోవైపు వాతావరణంలో మార్పుల నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: కోవిడ్ పై పోరులో మీకు సహకరిస్తాం, మీ ఆర్దర్లను అడ్డుకోకుండా చూస్తాం, సోను సూద్ కు చైనా రాయబారి హామీ
