AP Weather: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మంగళవారం వరకు వానలే వానలు.. రైతులూ ఇక రెడీ అవ్వొచ్చు
ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ఇక మంగళవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.
AP Rains: రైతులూ ఇక విత్తు పెట్టేందుకు రెడీ అవ్వండి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వర్షం కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెప్పింది వాతావరణ శాఖ. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం వాయువ్యంగా ట్రావెల్ అవుతంది. ఆదివారం దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్నది. ఈ ఎఫెక్ట్‌తో అదే ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమతీరంలో తీరద్రోణి విస్తరించడంతో అరేబియా సముద్రం నుంచి బలమైన గాలులు మధ్య భారతం మీదుగా వీస్తున్నాయి. ఈ ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా రుతుపవనాలు కూడా చురుగ్గా కదలుతున్నాయి. దీంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ(Rayalaseema)లో పలుచోట్ల వర్షాలు పడతాయని వాతావారణ శాఖ తెలిపింది. మంగళ, బుధవారాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెయిన్ అలెర్ట్ ఇచ్చింది.
ఆదివారం కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కోనసీమ, కృష్ణా, ఎన్‌టిఆర్, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో ఉరుములతో వర్షాలు కురిశాయి. భారీ ఈదురుగాలులు వీయడంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇక హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి