AP Weather Report: ఆంధ్రప్రదేశ్ వాతావరణ వివరాలు.. రాగల మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం..
AP Weather Report: ‘యాస్’ తుపాను క్రమంగా బలహీన పడుతోంది. దీని ప్రభావంతో తీర ప్రాంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు...
AP Weather Report: ‘యాస్’ తుపాను క్రమంగా బలహీన పడుతోంది. దీని ప్రభావంతో తీర ప్రాంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు వర్షాలతో పాటు.. పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
యాస్ తుపాను ప్రభావం కారణంగా ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు & పశ్చిమ గోదావరి జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉంది. ఇక రేపు ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు & పశ్చిమ గోదావరి జిల్లాలలో వేడి గాలులు వీచే అవకాశం ఉంది. ఆదివారం నాడు ఉత్తరకోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే.. ఈరోజు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం నాడు దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో ఇవాళ ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం నాడు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనను విడుదల చేశారు.
Also read:
శ్రీలంక తీరంలో కంటైనర్ నౌకలో భారీగా మంటలు.. శ్రీలంక విజ్ఞప్తితో రంగంలోకి దిగిన భారతీయ తీర రక్షణ దళం