శ్రీలంక తీరంలో కంటైనర్ నౌకలో భారీగా మంటలు.. శ్రీలంక విజ్ఞప్తితో రంగంలోకి దిగిన భారతీయ తీర రక్షణ దళం

Sri Lanka Ship: కొలంబో తీరం సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైన శ్రీలంక కంటైనర్‌ నౌకలో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు భారతీయ తీర రక్షణ దళం రంగంలోకి దిగింది..

శ్రీలంక తీరంలో కంటైనర్ నౌకలో భారీగా మంటలు.. శ్రీలంక విజ్ఞప్తితో రంగంలోకి దిగిన భారతీయ తీర రక్షణ దళం
Follow us
Subhash Goud

|

Updated on: May 28, 2021 | 3:51 PM

Sri Lanka Ship: కొలంబో తీరం సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైన శ్రీలంక కంటైనర్‌ నౌకలో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు భారతీయ తీర రక్షణ దళం రంగంలోకి దిగింది. నౌకలో చెలరేగుతున్న మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే శ్రీలంక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై స్పందించిన భారత ప్రభుత్వం సత్వరం సాయం అందించేందుకు సముద్ర జలాల్లో గస్తీ విధుల్లో ఉన్న వజ్రా, వైభవ్, నౌకలను సంఘటన స్థలానికి మళ్లించింది. మంటలను అదుపు చేయడంలో ఈ రెండు నౌకలు పూర్తిగా నిమగ్నమయ్యాయి. అయితే ఈ నౌకలో 25 టన్నుల నైట్రిక్‌ యాసిడ్‌తో సహా దాదాపు 1,500 కంటైనర్లను తీసుకెళ్తోంది. కొలంబో నౌకాశ్రయంలోకి ప్రవేశించడానికి కొంత సమయం ఉండగానే మంటలు చెలరేగాయి. నౌకలో ఈ యాసిడ్‌ ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు.  అయితే ఈనెల 25 నౌకలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. భారీగా మంటలు చెలరేగుతున్నాయి.

అలాగే కాలుష్యాన్ని నియంత్రించే ప్రత్యేక సదుపాయాలు ఉన్న ఐసీజీ సముద్ర అనే నౌకను కూడా ప్రమాదస్థలానికి అధికారులు తరలించారు. అగ్ని జ్వాలలను అదుపు చేసే చర్యలను మరింత వేగవంతం చేసేందుకు సముద్ర జలాల్లో చమురు తెట్టు ఏదైనా ఆవరించి ఉంటే దానిని నివారించేందుకు ఈ నౌక ఎంతగానో ఉపయోగపడుతుంది. మరోవైపు తీర రక్షణ దళానికి చెందిన ఐసీజీ డోనియా విమానం కూడా ఘటన జరిగిన ప్రాంతంలో తిరుగుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది.

ఇవీ కూడా చదవండి:

Covid Vaccine Animals: ప్రపంచంలోనే తొలిసారిగా జంతువులకు కరోనా వ్యాక్సినేషన్‌.. కార్నివాక్‌ కోవ్‌ పేరిట టీకా..!

Boat Accident: ఘోర ప్రమాదం.. పడవ మునిగి నలుగురు మృతి.. 156 మంది గల్లంతు.. సహాయక చర్యలు ముమ్మరం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?