AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: ఓరి దేవుడా.. మరో 2 రోజులు ఇట్టాగే వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

ఏపీలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలవలు, చెరువులకు గండ్లు పడ్డాయి. వాయుగుండం ప్రభావంతో ఏపీలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

AP Weather: ఓరి దేవుడా.. మరో 2 రోజులు ఇట్టాగే వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Andhra Weather Report
Ram Naramaneni
|

Updated on: Jul 20, 2024 | 1:40 PM

Share

శుక్రవారం నాటి వాయుగుండం చిల్కా సరస్సు సమీపంలో ఒడిశా తీరంనకు ప్రయాణించి  శనివారం ఉదయానికి అదే ప్రాంతంలో 19.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 85.4 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద స్థిరంగా ఉంది. ఈ వాయుగుండం పూరీ (ఒడిశా) కు నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్పూర్ (ఒడిశా) కు తూర్పు-ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశా, చత్తీస్ గఢ్ మీదుగా మరింత వాయువ్య దిశగా పయనించి రాగల 12 గంటల్లో క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్, అజ్మీర్, దామోహ్, మాండ్లా, రాయ్పూర్ మీదుగా ఒడిశా తీరం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. షియర్ జోన్ లేదా గాలుల కోత సుమారు 20°ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 నుండి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఈ క్రమంలో.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

శనివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

ఆదివారం;- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

శనివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

ఆదివారం;- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

సోమవారం :-  తేలికపాటి నుండి మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :-

—————-

శనివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఆదివారం;-  తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

సోమవారం :-   తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Follow Us
నిమ్మకాయ చట్నీ ఇలా పెడితే చాలు అదిరిపొద్ది..ఏడాది పాటు ఫ్రెష్‌గా!
నిమ్మకాయ చట్నీ ఇలా పెడితే చాలు అదిరిపొద్ది..ఏడాది పాటు ఫ్రెష్‌గా!
రోజుకు రూ.45 పొదుపుతో రూ.25 లక్షల రిటర్న్స్..జీవితాంతం ఉచిత బీమా!
రోజుకు రూ.45 పొదుపుతో రూ.25 లక్షల రిటర్న్స్..జీవితాంతం ఉచిత బీమా!
మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
9 గంటలకే కిటికీలు క్లోజ్.. వట్టివేళ్ల తడకల మ్యాజిక్!
9 గంటలకే కిటికీలు క్లోజ్.. వట్టివేళ్ల తడకల మ్యాజిక్!
ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గ్రూప్‌లో ఉన్నా సింగిల్‌గానే ఉన్నట్టు అనిపిస్తోందా?
గ్రూప్‌లో ఉన్నా సింగిల్‌గానే ఉన్నట్టు అనిపిస్తోందా?
హాట్ వాటర్, వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్.. నిజంగానే హెల్తీనా?
హాట్ వాటర్, వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్.. నిజంగానే హెల్తీనా?
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
రాత్రి ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా..? ఈ విషయం..
రాత్రి ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా..? ఈ విషయం..
శనివారం పూజ, ఉపవాసంలో ఈ తప్పులు చేయొద్దు.. వెంకటేశ్వర స్వామి...
శనివారం పూజ, ఉపవాసంలో ఈ తప్పులు చేయొద్దు.. వెంకటేశ్వర స్వామి...