AP News: రూపాయి ఖర్చు లేదు.. ప్రయాసా లేదు.. ఇట్టా వెళ్లి.. అట్టా నచ్చిన చేప తెచ్చుకోవడమే
చేపలు ఇష్టంగా తినేవారికి ఇది కదా లక్కీ చాన్స్. పెద్దగా కష్ట పడాల్సిన పనిలేదు. రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. పాత చీర తీసుకుని వెళ్తే.. నచ్చిన సైజున్న చేపను పట్టుకుని.. ఎంచక్కా ఇంటికి వచ్చేయొచ్చు. ఎక్కడంటే..?
మనకు నచ్చిన చేపను కొనాలంటే చేపల మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకోవాలి. లేదంటే.. దగ్గర్లో ఉన్న చేపల చెరువుకు వెళ్లాలి. లేదా కాలువ లేదా కుంట వద్ద గాలం వేసి మన ఫేట్ టెస్ట్ చేసుకోవాలి. కానీ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మాత్రం పంట పొలాలు.. కాలువల వద్దకు వెళ్తే చాలు.. ఎలాంటి ప్రయాస లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా నచ్చిన సైజ్ ఉన్న చేపల్ని తెచ్చుకోవచ్చు.
వర్షాల కారణంగా పొంగుతున్న వాగులు వంకలు పొంగి.. వరద నీరు పొలాల మీదుగా ప్రవహిస్తోంది. ఆ నీటిలో చేపలు కూడా వస్తున్నాయి. విషయం తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున పొలాలకు వెళ్లి చేపలు పడుతున్నారు. కేజీ దగ్గర నుంచి 6 కేజీల పైబడి భారీ చేపలు చిక్కుతుంటే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముసురలో పులసు పెట్టుకోడానికి మంచి చేపలు దొరికాయని చెబుతున్నారు.
ఐదు కేజీలు చేప ధర బయట మార్కెట్లో 1000 నుంచి 1500 రూపాయలు పలుకుతుంటే ఇక్కడ ఫ్రీగా దొరకుతున్నాయి. కొందరు ఆ చేపలు పట్టి ఊర్లోకి వెళ్లి.. కేజీ 100 రూపాయలకే అమ్ముతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…