Telangana: ఆహా.. ముసురులో భలే చాన్స్.. రోడ్డుపైనే చేపలు
మొన్న ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమజిల్లా అంతర్వేదిలో రోడ్డుపైకి పెద్ద సంఖ్యలో చేపలు కొట్టుకొచ్చాయి. దీంతో మత్స్యకారులు నదులకు వెళ్లే పనిలేకుండా రోడ్డుపైనే చేపలను పట్టుకొని పండగ చేసుకున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చేపలు రోడ్డుపైకి కొట్టుకొచ్చాయ్. బేతుపల్లి ప్రాజెక్ట్ నిండి పొంగి పొర్లుతుండటంతో… వరద నీటిలో చేపలు కూడా కొట్టుకొస్తున్నాయ్. దాంతో, చేపలను పట్టుకునేందుకు పోటీపడుతున్నారు స్థానికులు. దోమతెరలు, చీరలనే వలలుగా మార్చేసి చేపలను పట్టేస్తున్నారు. బేతుపల్లి ప్రాజెక్ట్ నుంచి రుద్రాక్షపల్లి వాగు వెంబటి టన్నులకొద్దీ చేపలు కొట్టుకొస్తున్నాయి. వలల్లో చిక్కన పెద్ద పెద్ద చేపలు చూసి మాంసప్రియులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పట్టుకున్న చేపలను కిలో వంద రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు. ఫ్రీగా దొరికిన చేపలతో.. వాన ముసురులో పులుసు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు మరికొందరు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

