Free Money: ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు.! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం..
అర్హులైన దేశ ప్రజలందరికీ ఉచితంగా క్యాష్ పంచాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్‌ను ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకు ఫ్రీ మనీని అందించేందుకు తాము సిద్ధమని థాయ్‌లాండ్ ప్రధాని థావిసిన్ ప్రకటించారు. దీనివల్ల దేశంలో ఆర్థిక పురోగతికి మార్గం సుగమం అవుతుందని, స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 1.2 శాతం నుంచి 1.6 శాతానికి పెరుగుతుందన్నారు.
అర్హులైన దేశ ప్రజలందరికీ ఉచితంగా క్యాష్ పంచాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్‌ను ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకు ఫ్రీ మనీని అందించేందుకు తాము సిద్ధమని థాయ్‌లాండ్ ప్రధాని థావిసిన్ ప్రకటించారు. దీనివల్ల దేశంలో ఆర్థిక పురోగతికి మార్గం సుగమం అవుతుందని, స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 1.2 శాతం నుంచి 1.6 శాతానికి పెరుగుతుందన్నారు. డిజిటల్ వ్యాలెట్ స్కీం ద్వారా దాదాపు 5 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని థాయ్‌లాండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ.19 లక్షలలోపు వార్షిక ఆదాయం, రూ.11 లక్షలలోపు పొదుపు మొత్తాలు కలిగిన తక్కువ ఆదాయ వర్గాలు మాత్రమే అప్లై చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ పథకానికి ఎంపికయ్యే వారి బ్యాంకు ఖాతాల్లో రూ.23వేలు అంటే 10వేల బహ్త్‌ల చొప్పున డిజిటల్ మనీని జమ చేయనున్నారు. దీన్ని పెట్రోల్ కొనుగోళ్లు, ఆన్లైన్ కొనుగోళ్లు వంటి వాటికి ఉపయోగించకూడదు. ఈ స్కీం అమలు అంత ఈజీ కాదని విపక్షాలు, పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న థాయ్‌లాండ్‌ను డిజిటల్ వ్యాలెట్ స్కీం దివాలా తీయించే ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. డిజిటల్ వ్యాలెట్ స్కీంకు స్టేట్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ నుంచి నిధులు పొందాలని తొలుత భావించింది. ఇప్పుడు నిర్ణయాన్ని మార్చుకుంది. 2024-25 దేశ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ స్కీంకు నిధులు కేటాయించాలని నిర్ణయించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.