Andhra Pradesh: ఏపీ ప్రజలను వదలనంటోన్న భానుడు.. మరో రెండు రోజులు ఉక్కపోతలే
ఆదివారం తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మెదక్‌లో జిల్లాలో వర్షం కురియడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి భిన్నంగా వాతావరణ పరిస్థితి ఉంది. ఏపీలో భానుడి ప్రతాపం తగ్గట్లేదు. నాలుగు నాలుగు రోజుల నుంచి...

ఆదివారం తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మెదక్‌లో జిల్లాలో వర్షం కురియడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనికి భిన్నంగా వాతావరణ పరిస్థితి ఉంది. ఏపీలో భానుడి ప్రతాపం తగ్గట్లేదు. నాలుగు నాలుగు రోజుల నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో.. వడగాలుల ప్రభావం పెరిగింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉక్కపోత పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే సోమ, మంగళవారాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఎండలోకి రావొద్దని సూచిస్తున్నారు. అయితే ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో కూడా గరిష్ఠంగా 42 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా సాయంత్రానికి కొంత చల్లబడుతోంది. ఇక ఏపీకి నైరుతి రుతుపవనాలు ఈ నెల 8వ తేదీన వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణ పరిస్థితే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..