5

AP Weather: చల్లటి వార్త.. ఏపీలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

మండే ఎండల్లో కూల్ న్యూస్ వచ్చింది. ఏపికి వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. అంతేకాదు ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని వెల్లడించింది. ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ మీ కోసం....

AP Weather: చల్లటి వార్త.. ఏపీలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
Andhra Weather Report
Follow us

|

Updated on: May 19, 2023 | 4:18 PM

ఏపీ వెదర్ రిపోర్ట్ విడుదల చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. నైరుతి గాలులు దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో నిలకడగా ఉన్నాయని వెల్లడించింది. గత 24-గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులు,  దక్షిణ అండమాన్ సముద్రంలో మే 19, 2023., వర్షపాతం ఏర్పడే అవకాశం కారణముగా నైరుతి రుతుపవనాల పురోగమనం సాధ్యపడినది. నైరుతి రుతుపవనాలు రాబోయే 3-4 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ & నికోబార్ దీవులు మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉపరితల ఆవర్తనము నుండి ద్రోణి ఇప్పుడు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు కొనసాగుతున్నది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు, దక్షిణ అండమాన్ సముద్రం మరియు నికోబార్ దీవులు విస్తరించే అవకాశం ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ / దక్షిణ దిశల్లో గాలులువీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————–

శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° నుండి 3° లు తక్కువుగా నమోదు కావచ్చును. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.  వేడి, అసౌకర్య వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును.

శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.  గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడి, అసౌకర్య వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును.

ఆదివారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

———————–

శుక్రవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° నుండి 3° లు తక్కువుగా నమోదు కావచ్చును. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. వేడి మరియు అసౌకర్య వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును.

శనివారం :-  తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.  వేడి, అసౌకర్య వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును.

ఆదివారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు.

రాయలసీమ :-

—————-

శుక్రవారం, శనివారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమముగా 2° నండి 4° లు గుర్తించబడిన పెరుగుదల ఉండే అవకాశము ఉన్నది.  ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడితో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును.

ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° నుండి 4° C వరకు ఎక్కువుగా నమోదు కావచ్చును.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..