AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP – Telangana: తెలుగు రాష్ట్రాల్లో నిండుకుండల్లా జలాశయాలు.. వాటర్ లెవల్స్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు నిండుకుండలా మారాయి. భారీ వర్షాలు, వరదలతో జలకళ సంతరించుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. అటు నాగార్జునసాగర్‌ దగ్గర 26 క్రస్ట్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

AP - Telangana: తెలుగు రాష్ట్రాల్లో నిండుకుండల్లా జలాశయాలు.. వాటర్ లెవల్స్ రిపోర్ట్..
Prakasam Barrage
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2024 | 8:03 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి పెరిగింది. దీంతో మొత్తం 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం ఇన్ ఫ్లో 2 లక్షల 93 వేల 141 క్యూసెక్యులు కాగా, ఔట్‌ ఫ్లో 2 లక్షల 79 వేల 150 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు ప్రకాశం బ్యారేజి నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. అటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. దీంతో ముంపు బాధిత ప్రాంతాల ప్రజలను అలర్ట్‌ చేశారు. గత కొన్ని రోజులుగా ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరడంతో ప్రకాశం బ్యారేజ్‌ జలకళను సంతరించుకుంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 లక్షల 74 వేల 309 క్యూసెక్కుల నీరు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 26 క్రస్టు గేట్స్ ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 3 లక్షల 74 వేల 304 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 2 లక్షల 69 వేల 562 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. నాగార్జునసాగర్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా కాగా, ప్రస్తుతం 298 టీఎంసీలుగా ఉంది. ఇటు సాగర్‌ క్రస్ట్‌ గేట్లు ఓపెన్‌ చేయడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు పిల్లా పాపలతో తరలివస్తున్నారు. దీంతో ఈ ఏరియాలో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోతున్నాయి. వరద నీరు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో నాగార్జునసాగర్‌ నుంచి దిగువకు నీటి విడుదల మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు
మహిళా ఎస్సై చెంప చెళ్లుమనిపించిన మద్యం వ్యాపారి కూతురు
మహిళా ఎస్సై చెంప చెళ్లుమనిపించిన మద్యం వ్యాపారి కూతురు