Viral Video: కోట్లు విలువచేసే అక్రమ మద్యం.. క్షణాల్లో నేలపాలు.. వీడియో చూస్తే మందుబాబులు ఉసూరుమంటారు
ఇల్లీగల్ లిక్కర్‌పై కొరడా ఝులిపిస్తున్నారు ఏపీ పోలీసులు. ఎక్కడికక్కడ అక్రమ మద్యాన్ని పట్టుకుని ధ్వంసం చేస్తున్నారు. లేటెస్ట్‌గా కడపలో కోట్ల రూపాయల విలువైన లిక్కర్‌ను మట్టిలో కలిపేశారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ లిక్కర్ డిమోలిషన్ కంటిన్యూ అవుతోంది. కోట్ల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని రోడ్డు రోలర్లతో తొక్కిస్తూ మట్టిలో కలిపేస్తున్నారు పోలీసులు. అక్రమ మద్యంపై స్టేట్ వైడ్‌గా స్పెషల్ డ్రైవ్ చేపడుతోన్న ఎక్సైజ్ అండ్ పోలీస్‌శాఖ… నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్‌పై కొరడా ఝులిపిస్తోంది. ఏ జిల్లాకు ఆ జిల్లాలో పెద్దఎత్తున ఇల్లీగల్ లిక్కర్‌ను డిమోలిషన్ చేస్తున్నారు అధికారులు. కడప జిల్లాలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు పోలీసులు. అక్రమ మద్యాన్ని ఒకేచోట చేర్చి రోడ్ రోలర్‌తో తొక్కించారు. రెండేళ్లలో పట్టుబడిన 17వేల 635 మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. జిల్లాలోని 32 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అదనపు ఎస్పీ పూజిత. ధ్వంసం చేసిన మద్యం విలువ కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తుండగా ఈ మద్యాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు ఏఎస్పీ పూజిత. మద్యం అక్రమ రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతామని.. కఠిన కేసులు పెట్టి జైల్లో పెడతామని స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
