Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు డేంజర్ వార్నింగ్స్.. ఇంతకీ ఆ ప్రాజెక్టుకు ఏమైంది?
Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు ఏమైంది? మరో ముళ్ల పెరియార్ డ్యామ్‌గా శ్రీశైలం రిజర్వాయర్ మారిందా? అవుననే అంటున్నారు నిపుణులు. శ్రీశైలం డ్యామ్ డేంజర్‌లో
Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు ఏమైంది? మరో ముళ్ల పెరియార్ డ్యామ్‌గా శ్రీశైలం రిజర్వాయర్ మారిందా? అవుననే అంటున్నారు నిపుణులు. శ్రీశైలం డ్యామ్ డేంజర్‌లో ఉందని హెచ్చరిస్తున్నారు. సేమ్ టు సేమ్, ముళ్ల పెరియార్ డ్యామ్ మాదిరిగానే శ్రీశైలంలో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోవడంతోపాటు, పెద్దఎత్తున వరద నీరు వస్తే తట్టుకునే శక్తి డ్యామ్‌కి లేదంటున్నారు.
శ్రీశైలం డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందంటున్నారు నిపుణులు. శ్రీశైలం రిజర్వాయర్‌కు ఒక్కసారిగా వరద నీరు పోటెత్తితే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. వరద నీరును మళ్లించడానికి ప్రత్యామ్నాయం చూడాలని, లేదంటే డ్యామ్ భద్రతకే ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.
కొత్తగా మరో స్విల్‌వే నిర్మించడం లేదా డ్యామ్ ఎత్తు పెంచడం చేయాలని సూచించింది నిపుణుల కమిటీ. అంతేకాదు, కుడి, ఎడమ వైపుల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఫార్సు ఏసింది. ప్రస్తుతమున్న డ్యామ్‌కు, స్పిల్‌వేకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పింది నిపుణుల కమిటీ.
శ్రీశైలం డ్యామ్ భద్రతపై అధ్యయనం చేసిన ఏబీ పాండ్యా కమిటీ, కేంద్ర జల సంఘానికి ఇచ్చిన నివేదికలో ఇవన్నీ ప్రస్తావించింది. ఇన్‌ఫ్లోకి తగ్గట్టుగా డ్యామ్‌లో నీటిని ముందుగానే ఖాళీ చేయాలని సూచించింది. మెయిన్‌గా అడిషనల్ స్పిల్‌వే నిర్మాణం, వరద నీటిని మళ్లించడం, డ్యామ్ ఎత్తును పెంచడం లాంటివి చేయాలని రిపోర్ట్ ఇచ్చింది.
Also read:
Ambani Daughter in Law: ముఖేష్ అంబానీ కొడలు సంపద ఎంతో తెలిస్తే అవాక్కవుతారు..!
Telangana: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ని ఢీకొట్టిన కారు.. ఫ్యామిలీ మొత్తం..!