AP News: ఇదేంటి మాస్టారూ.! పాఠాలు చెప్పాల్సిందిపోయి.. స్టూడెంట్ తల్లితో అలా

పాఠాలు చెప్పాల్సిందిపోయి.. ఓ హెడ్‌మాస్టర్‌ పాడుపనికి దిగాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మధుపాడలో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అదేంటంటే..

AP News: ఇదేంటి మాస్టారూ.! పాఠాలు చెప్పాల్సిందిపోయి.. స్టూడెంట్ తల్లితో అలా
Representative Image
Follow us
G Koteswara Rao

| Edited By: Ravi Kiran

Updated on: Nov 16, 2024 | 11:22 AM

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మధుపాడ ప్రభుత్వ పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఓ విద్యార్థి తల్లిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తన కుమారుడి కండక్ట్ సర్టిఫికెట్‌తో పాటు పలు పత్రాల్లో కొన్ని తప్పులు ఉండటంతో.. వాటిని సరిచేయాలని అదే గ్రామానికి చెందిన ఓ మహిళ పాఠశాలకు వెళ్లి హెడ్‌మాస్టర్‌ శ్రీనివాసరావును అడిగింది. దీంతో విద్యార్థి సర్టిఫికెట్స్ గతంలో తీసుకున్నవి కాబట్టి.. అప్పుడు సర్టిఫికెట్స్ ఇచ్చిన టీచర్ మాత్రమే మార్చాలని.. ప్రస్తుతానికి అతడు ఎస్ కోట మండలం బొడ్డవరలో పనిచేస్తున్నాడని చెప్పాడు. తనతో అక్కడికి వస్తే.. అక్కడి హెడ్‌మాస్టర్‌‌తో మాట్లాడి సరిచేయిస్తానని నమ్మబలికించాడు.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

అలా హెడ్‌మాస్టర్‌ మాటలు నమ్మిన విద్యార్థి తల్లి అతనితో వెళ్లడానికి సిద్ధమైంది. దీంతో హెడ్‌మాస్టర్‌ విద్యార్థి తల్లిని బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్తూ మార్గంమధ్యలో ఓ తోటలోకి పోనిచ్చాడు. అలా తీసుకెళ్లిన హెడ్‌మాస్టర్‌ తన కోరిక తీర్చాలని, తన కోరిక తీరిస్తేనే కుమారుడి పత్రాలు సరిచేయిస్తానని బ్లాక్ మెయిల్‌కు దిగాడు. అందుకు విద్యార్థి తల్లి ససేమిరా అనడంతో అత్యాచారానికి ప్రయత్నించాడు. అప్పటికే హెడ్‌మాస్టర్‌ ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లడంతో ఆమె కేకలు వేసినా.. సహాయం చేసేవారు ఎవరూ కనిపించలేదు. అక్కడ సుమారు గంటకు పైగా వారిద్దరి మధ్య ప్రతిఘటన జరిగింది. అలా చాలాసేపు హెడ్‌మాస్టర్‌ వికృత చేష్టలతో విద్యార్థి తల్లి నరకం చూసింది. చివరకు చేసేది లేక హెడ్‌మాస్టర్‌ శ్రీనివాస్ ఆమెను బైక్‌పై ఎక్కించుకుని మార్గంమధ్యలో పందిర అప్పన్న జంక్షన్‌లో దించాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

‘నాకు సహకరించలేదు కాబట్టి.. నీ కుమారుడి సర్టిఫికెట్లు ఎలా వస్తాయో చూస్తానని బెదిరించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు’. ఆ తర్వాత కొద్దిసేపటికి విద్యార్థి తల్లి తన భర్తకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాడు ఆమె భర్త. అక్కడ నుంచి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నేరుగా విజయనగరంలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిందంతా పోలీసులకు తెలియజేశారు. హెడ్‌మాస్టర్‌ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. విద్యార్థి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్కూల్‌లో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన హెడ్‌మాస్టర్‌ కీచక అవతారం ఎత్తడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వెంటనే శ్రీనివాసరావుపై చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..