YS Sharmila – Sunitha: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం.. అక్కను కలిసిన చెల్లి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ హాట్ హాట్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత స్పీడ్ అయ్యాయి. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఈరోజు కడపలో ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లో వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఒక చరిష్మా ఉంది. అందులోనూ ఆయన బిడ్డలు జగన్, షర్మిల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయంగా నిలదొక్కుకున్నారు. అయితే గత కొంతకాలంగా షర్మిల, సీఎం జగన్ మధ్య కొంత విభేదాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన షర్మిల ఈ మధ్యనే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ కనుమరుగయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపిరిని పోశారు.
ఈ క్రమంలో ఈరోజు తన సొంత జిల్లా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన షర్మిల రాజకీయంగా పెద్ద షాట్ ఇచ్చారు. వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న తన సొంత బాబాయి వివేకానంద రెడ్డి కూతురిని కలవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గెస్ట్ హౌస్ లో తన సోదరి మీదతో షర్మిల భేటీ ఏం మాట్లాడుకున్నారు..? అనేది ఇప్పుడు అంతా చర్చినీయాంశంగా మారింది.
వీడియో చూడండి..
హైదరాబాద్ నుంచి నేరుగా ఇడుపులపాయకు వచ్చిన సునీత.. షర్మిలతో భేటీ అయ్యారు. ముందుగా.. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ నుంచి షర్మిలతో కలిసి కడపకు రానున్నారు సునీత రెడ్డి.
ఈ క్రమంలో.. షర్మిల, సునీతలు కలిసి ప్రచారం చేస్తారా..? లేదా సునీత కాంగ్రెస్ లో చేరుతారా..? అసలు ఏం జరుగుతుంది అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇప్పుడు షర్మిల ని కలవడం రసవత్తర రాజకీయానికి తెరలేపినట్లయింది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..