Vizag: ఆ ప్రాంతంలో మామిడి, జామచెట్లకు గుమ్మడికాయలు.. ఈ విచిత్రం వెనుక సీక్రెట్ ఇదే..

పంటల్లో అత్యంత విలువైన పంటగా భావించే.. గుమ్మడి కాయను భద్రపరిచేందుకు కూడా గిరిజనులు అంతే ప్రాధాన్యత ఇస్తారు. సీజన్లలో పండే గుమ్మడి కాయలను.. ఏడాదంతా వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు.

Vizag: ఆ ప్రాంతంలో మామిడి, జామచెట్లకు గుమ్మడికాయలు.. ఈ విచిత్రం వెనుక సీక్రెట్ ఇదే..
Pumpkin
Follow us

|

Updated on: Jan 29, 2022 | 11:58 AM

AP News: విశాఖ ఏజెన్సీ(Vizag agency) ప్రాంతంలో ఏ చెట్టుకు చూసినా గుమ్మడికాయలే కనిపిస్తాయి..! ప్రతి కొమ్మకు, చెట్టుకు ఒకటో రెండో గుమ్మడికాయలు వేలాడుతూ ఉంటాయి. ఈ సీజన్ లో ఎక్కడ చూసినా ఈ గుమ్మడి కాయలే చెట్లకు కనిపిస్తుంటాయి.. చెట్టు ఏదైనా సరే.. కనిపించేది మాత్రం గుమ్మడికాయే(Pumpkin )! ఎక్కడైనా ఇలాంటి చెట్లకు గుమ్మడికాయలు కాస్తాయా అనే కదా మీ సందేహం….?! చూస్తుంటేనే వింతగా, ఆశ్చర్యంగా ఉంది కదూ..?!. కానీ ఆ గుమ్మడికాయల వెనుక ఓ కథే ఉంది. విశాఖ ఏజెన్సీలో గిరిజనులు(Tribes) గుమ్మడికాయకు ప్రత్యేకంగా ఆదరణ చూపిస్తారు. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే.. గుమ్మడికాయ ఇచ్చి పంపించడం ఆనవాయితీ. గుమ్మడికాయ ఇస్తే మేకపోతు ఇచ్చినంత ఫీలింగ్. మేకపోతు విలువ ఎంత ఉంటుందో.. ఆ గుమ్మడికాయ కూడా అంతే విలువతో సమానంగా చూస్తారు అక్కడి గిరిజన రైతులు. అంతేకాదు గుమ్మడికాయ ఆకులకు కూడా ప్రత్యేక పండగ కూడా ఉంటుంది. గుమ్మడి ఆకులో అన్నం తినేందుకు కొర్రకొత్త పండగ కూడా చేస్తారు గిరిజనులు. పెళ్లిళ్లలో ప్రత్యేకంగా గుమ్మడి కాయకు ప్రాధాన్యత ఇస్తారు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. మరి అక్కడి చెట్లకు కనిపిస్తున్న గుమ్మడికాయల సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంటల్లో అత్యంత విలువైన పంటగా భావించే.. గుమ్మడి కాయను భద్రపరిచేందుకు కూడా గిరిజనులు అంతే ప్రాధాన్యత ఇస్తారు. సీజన్లలో పండే గుమ్మడి కాయలను.. ఏడాదంతా వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. దీనికితోడు, వచ్చే సీజన్‌లో గుమ్మడి గింజల కోసం కూడా ప్రత్యేకంగా ఆలోచిస్తారు. ఇంట్లో పెడితే ఎలుకల భయం..! అందుకే.. పెరట్లో ఉన్న చెట్లకు గుమ్మడి కాయలను ఇలా వేలాడదీస్తారు. చెట్టుతో సంబంధం లేకుండా.. మామిడి, జామ, ఉసిరి ఇలా ఏ చెట్టు కైనా గుమ్మడి కాయలను ప్రత్యేకంగా కట్టి దాచుకుంటారు. విశాఖ ఏజెన్సీలో గుమ్మడి కాయలు నిల్వ ఉంచేందుకు గిరి రైతులు.. ఈ ఫార్ములాను వాడుతుంటారు. చెట్టుకు కడితే ఎక్కువరోజులు నిలవ కూడా ఉంటుందని చెబుతున్నారు. గిరిజనులు గుమ్మడి కాయలను ఎక్కువగా ఆహారంగా కూడా తీసుకుంటుంటారు. అందుకే వీటిని అంత భద్రంగా చూసుకుంటారు. ఇదీ విశాఖ ఏజెన్సీలో వేలాడుతున్న గుమ్మడికాయల కథ.

Pampkin

Also Read: ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు.. నేడు అధికారిక ప్రకటన

శ్మశానం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతం వద్ద కనిపించిన రంధ్రాలు.. దిగి చెక్ చేయగా అద్భుతం