మోదీ బర్త్ డే గిఫ్ట్..న్యూ ఫీచర్స్‌తో నమో యాప్
రేపు ప్రధాని నరేంద్రమోదీ 69వ పుట్టినరోజు. దీంతో గ్రాండ్ సెలబ్రేషన్స్‌కు రెడీ అయింది కమలం పార్టీ. దేశప్రజలకు మోదీ పుట్టినరోజు కానుక అందించింది. బెటర్, ఫాస్టర్, స్లీకర్ ట్యాగ్‌లైన్‌తో నమో యాప్‌ను అప్ డేట్ చేసి న్యూ వర్షన్‌ను లాంచ్ చేసింది. స్పీడ్‌గా బ్రౌజ్ చేసేలా కొత్త డిజైన్ రూపొందించింది. మోదీకి సంబంధించిన సమాచారం కోసం..నమో ఎక్స్‌క్లూజివ్ అనే కంటెంట్ సెక్షన్..ఒక స్టోరీ నుంచి మరో స్టోరీకి వెళ్లేందుకు స్లైడ్ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. నమో యాప్‌లో కేంద్రప్రభుత్వ […]

రేపు ప్రధాని నరేంద్రమోదీ 69వ పుట్టినరోజు. దీంతో గ్రాండ్ సెలబ్రేషన్స్‌కు రెడీ అయింది కమలం పార్టీ. దేశప్రజలకు మోదీ పుట్టినరోజు కానుక అందించింది. బెటర్, ఫాస్టర్, స్లీకర్ ట్యాగ్‌లైన్‌తో నమో యాప్‌ను అప్ డేట్ చేసి న్యూ వర్షన్‌ను లాంచ్ చేసింది. స్పీడ్‌గా బ్రౌజ్ చేసేలా కొత్త డిజైన్ రూపొందించింది. మోదీకి సంబంధించిన సమాచారం కోసం..నమో ఎక్స్‌క్లూజివ్ అనే కంటెంట్ సెక్షన్..ఒక స్టోరీ నుంచి మరో స్టోరీకి వెళ్లేందుకు స్లైడ్ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. నమో యాప్‌లో కేంద్రప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్‌ఫోగ్రాఫిక్స్, మన్ కీ బాత్ ఎపిసోడ్స్ ఉంటాయి. నమో మర్కంటైజ్, మైక్రో డొనేషన్స్ వంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి. మైక్రో డొనేషన్ ఆప్షన్ ద్వారా పార్టీకి విరాళాలు ఇవ్వొచ్చు.
2019 ఎన్నికల నేపథ్యంలో 2018లో నరేంద్రమోదీ యాప్‌ను అప్‌డేట్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఆ యాప్ ఎంతో ఉపయోగపడింది. మేనిఫెస్టోతో పాటు తన పర్యటనలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ఫాలో అవుతూ మార్పులు చేర్పులు చేసుకునేవారు ప్రధాని మోదీ. పొలిటీషియన్స్‌కు సంబంధించి వరల్డ్ వైడ్‌గా పాపులరైన నమో యాప్‌ను ఇప్పటివరకూ 1.5కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.