మిస్టరీ: అఙ్ఞాతంలోకి వృద్ధ తల్లిదండ్రులు.. ఇప్పుడు ఎక్కడున్నారు..?

ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా సెప్టెంబర్ 5న ఆడకవలలకు జన్మనిచ్చి.. 74ఏళ్ల వయసులో తల్లిదండ్రులై తమ చిరకాల కోరికను నెరవేర్చుకున్న ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులు ఎక్కడున్నారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. వారికి తెలిసిన వారందరికీ కూడా ఇప్పుడు ఇదే ఒక ప్రశ్నగా మిగిలింది. ప్రపంచంలోనే సంచలనం రేకెత్తించిన ఈ వృద్ధుల జాడను తెలుసుకునేందుకు బంధువులు, డాక్టర్లను సంప్రదించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని నేలప్రత్తిపాడు వీరి స్వగ్రామం కాగా.. గత కొన్ని రోజులుగా అక్కడ […]

మిస్టరీ: అఙ్ఞాతంలోకి వృద్ధ తల్లిదండ్రులు.. ఇప్పుడు ఎక్కడున్నారు..?
Follow us

| Edited By:

Updated on: Nov 14, 2019 | 12:57 PM

ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా సెప్టెంబర్ 5న ఆడకవలలకు జన్మనిచ్చి.. 74ఏళ్ల వయసులో తల్లిదండ్రులై తమ చిరకాల కోరికను నెరవేర్చుకున్న ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులు ఎక్కడున్నారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. వారికి తెలిసిన వారందరికీ కూడా ఇప్పుడు ఇదే ఒక ప్రశ్నగా మిగిలింది. ప్రపంచంలోనే సంచలనం రేకెత్తించిన ఈ వృద్ధుల జాడను తెలుసుకునేందుకు బంధువులు, డాక్టర్లను సంప్రదించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని నేలప్రత్తిపాడు వీరి స్వగ్రామం కాగా.. గత కొన్ని రోజులుగా అక్కడ వారి ఇంటికి తాళాలు వేసి ఉండటం గమనర్హం. ఇక వీరి గురించి సమాచారం తెలుసుకునేందుకు గ్రామస్తులను ప్రశ్నించినప్పటికీ.. వారు కూడా తమకు తెలీదంటూ తెల్లమొహం వేయడంతో.. ఇప్పుడు వృద్ధ దంపుతుల గురించి చర్చ నడుస్తోంది.

అయితే ఎలాగైనా పిల్లలను కనాలని భావించిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులు గత ఏడాది ఊరిని విడిచి, గుంటూరుకు వెళ్లారు. అక్కడ బంధువుల ఇంట్లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకున్న మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చింది. దీంతో ఒక్కసారిగా వీరు సెలబ్రిటీలు అయ్యారు. అయితే లేటు వయసులో ఇలా పిల్లలకు జన్మనివ్వడంతో వీరిపై కొందరు విమర్శలు కూడా గుప్పించారు. ఈ వయసులో ఆ పిల్లల ఆలనాపాలనా ఎలా చూసుకుంటారు..? వయసు మీద పడింది కాబట్టి ఆ పిల్లల భవిష్యత్ ఏంటి..? ఇలా పలు ప్రశ్నలు వినిపించాయి. ఇక కొందరు డాక్టర్లపై కూడా విమర్శలు కురిపించారు. మీరైనా వారి వయసును దృష్టిలో పెట్టుకోవాల్సింది..? అని విమర్శించారు. ఈ క్రమంలో మీడియాకు దూరంగా ఉండాలంటూ డాక్టర్లు సూచించగా.. ఇప్పుడు తమ స్వగ్రామానికి కూడా దూరంగా ఉంటున్నారు వీరు. ఈ దంపతుల గురించి తెలుసుకునేందుకు ఓ జాతీయ దిన పత్రికా ప్రతినిధులు డాక్టర్లను ప్రశ్నించగా.. వారు ఎక్కడి నుంచి వచ్చారో తమకు కచ్చితంగా తెలీదని, కానీ వారిని డిస్టర్బ్ చేయకపోవడమే మంచిదని చెప్పుకొచ్చారు. ఇక రాజారావు బంధువులలో ఒక వ్యక్తికి ఫోన్ చేయగా.. వారు కచ్చితంగా కృష్ణ లేదా గుంటూరు జిల్లాలో ఉంటారంటూ చెప్పుకు రావడం పత్రికా ప్రతినిధులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

కాగా గతేడాది నేలప్రత్తిపాడును విడిచిన ఈ ఇద్దరు తల్లిదండ్రులు అవ్వడం కోసమే ఊరిని విడిచి వెళ్లారని తమకు తెలీదని, వార్తల్లో వచ్చినప్పుడే తమకు ఈ విషయం తెలిసిందని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. ఇక పిల్లలు పుట్టిన తరువాత గ్రామానికి వచ్చిన వారు.. ఓ చిన్న ఫంక్షన్‌ను చేశారని, దానికి వారి బంధువులు కూడా హాజరయ్యారని ఓ గ్రామస్తుడు పేర్కొన్నాడు. రాజారావుకు నేలప్రత్తిపాడులో 15 ఎకరాల పొలం ఉందని.. దానిని చూసుకునేందుకు కొన్ని వారాల క్రితం ఊరికొచ్చాడని.. పనిని పూర్తి చేసుకొని త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయాడని.. పిల్లల గురించి అడిగితే బావున్నారంటూ చెప్పుకొచ్చారని ఓ వ్యక్తి వెల్లడించాడు. అంతేకాదు ఫోన్‌లో కూడా ఆ గ్రామస్తులతో రాజారావు కాంటాక్ట్‌లో లేరని తెలుస్తోంది. ఇక వీరు ఇప్పుడు ఎక్కడున్నారన్న దానిపై స్థానిక పోలీసులు సంప్రదించినా.. ఫలితం శూన్యం. దీంతో ఈ వృద్ధ దంపుతులు ఎక్కడున్నారు..? ఆ కవలలు ఎలా ఉన్నారు..? మంగాయమ్మ ఆరోగ్యం ఎలా ఉంది..? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.

అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్