వీడిన మిస్టరీ.. పథకం ప్రకారమే జ్యోతి హత్య

వీడిన మిస్టరీ.. పథకం ప్రకారమే జ్యోతి హత్య

గుంటూరు: మంగళగిరిలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడు శ్రీనివాసే జ్యోతిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. స్నేహితుడు పవన్‌తో కలిసి శ్రీనివాస్.. జ్యోతిని హత్య చేసినట్లు వారు వెల్లడించారు. పెళ్లి చేసుకోమని జ్యోతి ఒత్తిడి చేయడంతోనే శ్రీనివాస్ ఈ హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం గత సోమవారం జ్యోతిని అమరావతి టౌన్‌షిప్‌కు తీసుకెళ్లాడు శ్రీనివాస్. ఆ తరువాత శ్రీనివాస్ స్నేహితుడు పవన్ అక్కడకు రాగా.. ఇద్దరు ఆమెపై […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 18, 2019 | 11:26 AM

గుంటూరు: మంగళగిరిలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రియుడు శ్రీనివాసే జ్యోతిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. స్నేహితుడు పవన్‌తో కలిసి శ్రీనివాస్.. జ్యోతిని హత్య చేసినట్లు వారు వెల్లడించారు. పెళ్లి చేసుకోమని జ్యోతి ఒత్తిడి చేయడంతోనే శ్రీనివాస్ ఈ హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు తెలిపారు.

పథకం ప్రకారం గత సోమవారం జ్యోతిని అమరావతి టౌన్‌షిప్‌కు తీసుకెళ్లాడు శ్రీనివాస్. ఆ తరువాత శ్రీనివాస్ స్నేహితుడు పవన్ అక్కడకు రాగా.. ఇద్దరు ఆమెపై దాడి చేశారు. జ్యోతి కాళ్లు, చేతులు శ్రీనివాస్ పట్టుకుంటే.. పవన్ ఇనుపరాడ్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ తరువాత అనుమానం రాకుండా ఉండాలని శ్రీనివాస్ తలపై కూడా పవన్ దాడి చేశాడు. హత్యానంతరం ఇనుపరాడ్‌ను తాడేపల్లిలోని ఓ కాలువలో పడేసి పవన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకోసం వారం రోజుల ముందుగానే నిందితులు రిక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu