అనంతపురంలో టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. దీంతో కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘర్షణతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. అయితే మరోసారి దాడులు జరగకుండా పోలీసులు భారీ […]

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. దీంతో కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని దగ్గరలోని హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘర్షణతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. అయితే మరోసారి దాడులు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Follow Us